Moviesనాగార్జున సంచలన నిర్ణయం..మరోసారి అక్కినేని ఫ్యామిలీ మొత్తం కలిసి నటించబోతున్నారోచ్.. ఏ...

నాగార్జున సంచలన నిర్ణయం..మరోసారి అక్కినేని ఫ్యామిలీ మొత్తం కలిసి నటించబోతున్నారోచ్.. ఏ సినిమాలో అంటే..?

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా ట్రెండ్ అవుతుంది . అక్కినేని నాగార్జున ఇండస్ట్రీలో ఎలాంటి స్థానం దక్కించుకున్నాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తండ్రి నాగేశ్వరరావు గారి పేరు చెప్పుకొని ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సరే .. తనదైన స్టైల్ లో నటించి మెప్పిస్తున్నాడు. నాగార్జున తన వందవ సినిమాని చాలా చాలా పకడ్బందీగా ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమాలో హీరోయిన్లుగా నయనతార త్రిషలను కన్ఫామ్ చేసుకున్నారట.

అంతేకాదు ఈ సినిమా కెరియర్ లో గుర్తుండిపోయే విధంగా ఇప్పుడు సంచలన నిర్ణయం తీసుకున్నాడట . నాగార్జున తన 100వ సినిమాలో తన భార్య అమలతో పాటు నాగచైతన్య అఖిల్ కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారట. మనం సినిమా ఏ విధంగా అయితే హిట్ అయిందో ఆ విధంగా ఈ సినిమా హిట్ అయ్యే విధంగా అక్కినేని ఫ్యామిలీ మొత్తం ఈ సినిమాలో కలిసిన నటించబోతుందట. ఇది తెలుసుకున్న ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు .

ఇలాంటి స్ట్రాంగ్ డెసిషన్స్ తీసుకోవాలి అంటే నాగార్జున గారి తర్వాత ఎవరైనా అంటూ పొగిడేస్తున్నారు . సోషల్ మీడియాలో ఈ న్యూస్ ఇప్పుడు బాగా వైరల్ గా మారింది . చూద్దాం మరి ఈ సినిమా పై అఫిషియల్ అప్డేట్ ఎప్పుడు వస్తుందో .. అందుతున్న సమాచారం ప్రకారం కొత్త డైరెక్టర్ తో ఈ మూవీని కమిట్ అయ్యాడట నాగార్జున. ఈ సినిమాలో ఓ ఐటెం సాంగ్ కూడా ఉందని .. దాదాపు పదిమంది హీరోయిన్స్ ని గెస్ట్ రోల్స్ గా ఈ పాటలో చూపించబోతున్నారు అంటూ కూడా ప్రచారం జరుగుతుంది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news