టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న చిరంజీవి గురించి ప్రత్యేకంగా పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు . ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన స్ధానాని క్రియేట్ చేసుకున్నారు . చిరంజీవి చిన్న కూతురు శ్రీజ సోషల్ మీడియాలో ఎప్పుడు నిరంతరం ట్రోలింగ్కి గురవుతూనే ఉంటుంది . మరి ముఖ్యంగా శ్రీజ పెళ్లిళ్ల మ్యాటర్స్ ఎప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతూనే ఉంటాయి. చిరంజీవి చిన్న కూతురు శ్రీజ చాలా చిన్న ఏజ్ లోనే శిరీష్ భరద్వాజ్ అనే అతనిని ఇంట్లో చెప్పకుండా గుడిలో పెళ్లి చేసుకుని నానా రాద్ధాంతం సృష్టించిన విషయం అందరికీ తెలిసిందే . ఆ టైంలో ఏకంగా చిరంజీవిపై కేసు వేయడానికి కూడా సిద్ధపడింది శ్రీజ .
అంతేకాదు పవన్ కళ్యాణ్ వద్ద గన్ ఉందని ఆ గన్ తో మాకు ప్రాణహాని ఉంది అంటూ పోలీస్ కేసు కూడా ఫైల్ చేసింది . అలాంటి శ్రీజ తర్వాత ఆయనకి విడాకులు ఇచ్చేసింది. ఆ తర్వాత కళ్యాణ్ దేవ్ ని పెళ్లి చేసుకుంది . అతగాడికి విడాకులు ఇచ్చేసింది . కాగా రీసెంట్గా శ్రీజ మాజీ భర్త శిరీష్ భరద్వాజ్ కన్నుమూశారు . లంగ్స్ డామేజ్ అయిన కారణంగా గత కొన్ని రోజులుగా హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్న ఆయన కొద్దిసేపటి క్రితమే మృతి చెందినట్లు తెలుస్తుంది .
2007లో శ్రీజను వివాహం చేసుకున్న శిరీష్ భరద్వాజ్ ఆ తర్వాత 2014లో చట్టబద్ధంగా విడాకులు తీసుకున్నారు . వీళ్ళకి ఒక పాప కూడా ఉంది . 2016 లో శ్రీజ కళ్యాణ్ ను కళ్యాణ్ దేవ్ ని వివాహం ఆడారు. కాగా శిరీష్ – శ్రీజ ఆ తర్వాత ఎప్పుడు కలిసింది లేదు.. ఎక్కడ వాళ్ల గురించి మాటలు చర్చలు ఏమీ జరగలేదు. తన పని తను చేసుకుంటూ ఉన్న శిరీష్ భరద్వాజ్ ఆ తర్వాత తన డాక్టర్ గర్ల్ ఫ్రెండ్ ని పెళ్లి చేసుకున్నాడు . అయితే గత కొన్ని రోజులుగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న శిరీష్ భరద్వాజ్ కొద్దిసేపటి క్రితమే మరణించినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన మృతికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..!!