జూనియర్ ఎన్టీఆర్ ..ఏది చేసిన చాలా స్పెషల్ గా ఉంటుంది .. ఏం చేసినా కూడా కరెక్ట్ గానే చేస్తాడు ..డబ్బు అంటే అత్యాశ లేదు.. పెద్దవాళ్ళు అంటే గౌరవం ..చిన్నవాళ్లు అంటే ప్రేమ.. రెస్పెక్ట్ కి మరో మారుపేరనే చెప్పాలి . జూనియర్ ఎన్టీఆర్ ఎలా రెస్పెక్ట్ ఇస్తూ ఉంటాడో మనందరికీ తెలిసిందే . కాగా జూనియర్ ఎన్టీఆర్ ప్రెసెంట్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తుంది .
ఈ సినిమా కోసం జాన్వి ఎన్టీఆర్ చాలా చాలా కష్టపడుతున్నారు. కొరటాల కూడా ఈ సినిమాతో హిట్ కొట్టాలని చాలా కసిగా ఉన్నాడు. ఈ సినిమా అయిపోయిన వెంటనే వార్ 2 కూడా ప్రజెంట్ సెట్స్ పై ఉంది అది కూడా కంప్లీట్ అయిపోతుంది . ఆగస్టులో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కే సినిమాను సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు జూనియర్ ఎన్టీఆర్ . ఈ క్రమంలోనే ఈ సినిమా కోసం ఆయన తీసుకుంటున్న రెమ్యూనరేషన్ హైలెట్ గా మారింది .
ఇప్పటివరకు జూనియర్ ఎన్టీఆర్ తన కెరియర్ లో తీసుకున్న హైయెస్ట్ రెమ్యూనరేషన్ ఆర్ఆర్ఆర్. ఈ సినిమా కోసం ఏకంగా 80 కోట్లు పుచ్చుకున్నాడట . ఆ తర్వాత దేవర కోసం 100 కోట్లు ఛార్జ్ చేశాడట. అలాగే వార్ 2 సినిమా కోసం కూడా ఆయన 100 కోట్లు చార్జ్ చేశారట . కెరియర్ లోనే ఫర్ ద ఫస్ట్ టైం ప్రశాంత్ నీల్ సినిమా కోసం 130 కోట్లు రెమ్యూనిరేషన్ అందుకుంటున్నాడట ఎన్టీఆర్ . ఇది మేకర్స్ ఆయనకు ఫిక్స్ చేసిన రేట్ అంటూ తెలుస్తుంది . దీంతో ఆయన కెరియర్లో ఎన్టీఆర్ 31 మూవీ చాలా చాలా స్పెషల్గా నిలవబోతోంది అంటున్నారు అభిమానులు. జూనియర్ ఎన్టీఆర్ రేంజ్ పూర్తిగా మారిపోయింది అంటూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు..!!