Moviesవారెవ్వ: అశ్వీన్ దత్ మార్వెలెస్ ప్లాన్..కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి...

వారెవ్వ: అశ్వీన్ దత్ మార్వెలెస్ ప్లాన్..కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా ఎవరు వస్తున్నారో తెలుసా..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా ట్రెండ్ అవుతుంది. ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఒక పేరు మారు మ్రోగిపోతుంది . అదే పవర్ స్టాండ్ పవన్ కళ్యాణ్. అంతేకాదు నాలుగవసారి ముఖ్యమంత్రిగా ఏపీ ప్రజలకు సేవ చేయడానికి రెడీ అయిపోయాడు నారా చంద్రబాబు నాయుడు గారు . ఈ క్రమంలోనే ఏపీ అధికార పార్టీ వైసీపీని తుక్కుతుక్కు ఓడించి ఏపీలో కూటమి అధికారం చేపట్టేలా చేసిన గేమ్ చేంజర్ గా పవన్ కళ్యాణ్ అలాగే మోస్ట్ ఎక్స్పీరియన్స్ రాజకీయ నేత చంద్రబాబు నాయుడును ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు అభిమానులు .

తాజాగా ఓ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ హాట్ గా ట్రెండ్ అవుతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద బడా హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటిస్తున్న సినిమా కల్కి. ఈ సినిమా ఈనెల 27వ తేదీ రిలీజ్ కాబోతుంది . ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ కి బాగా కష్టపడుతున్నారు మూవీ టీం. కాగా ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలని నిర్ణయించారు . అందుతున్న సమాచారం ప్రకారం జూన్ 23 లేదా 25వ తేదీ ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జరపబోతున్నారట .

ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా సీఎం హోదాలో నారా చంద్రబాబు నాయుడు మినిస్టర్ హోదాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాబోతున్నారట . దీనికి సంబంధించిన వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. అశ్విని దత్ కి చంద్రబాబు చాలా క్లోజ్ ..ఆయన అరెస్టు అయినప్పుడు కూడా చంద్రబాబుకు సపోర్ట్ చేశాడు అశ్విని దత్ . ఈ క్రమంలోనే ఫ్రెండ్షిప్ ని మరోసారి ప్రూవ్ చేసుకోబోతున్నారు వీళ్ళు అంటూ బాగా వార్తలు వినిపిస్తున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news