సమంత .. సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ట్రెండ్ అయ్యే ఒక పేరు . ఏం మాయ చేసావే సినిమా ద్వారా స్టార్ హీరోయిన్గా మారిపోయిన సమంత ఆ తర్వాత తనదైన స్టైల్ లో సినిమాల్లో నటించి సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్స్ ని తన ఖాతాలో వేసుకుంది. సమంత నటించిన సినిమాలు జనాలను ఎలా ఆకట్టుకున్నాయో అందరికీ తెలిసిందే. మరి ముఖ్యంగా బడా బడా స్టార్స్ కూడా ఆమె కాల్ షీట్స్ కోసం వెయిట్ చేశారు అంటే సమంత రేంజ్ ఏ విధంగా ఉందో కూడా అర్థం చేసుకోవచ్చు. అయితే ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత సమంత సినిమాలకు దూరమైంది .. కేవలం ట్రెడిషనల్ పాత్రలోనే మెరిసింది .
ది ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ లో బోల్డ్ గా కనిపించింది తప్పిస్తే ఎక్కడా కూడా వల్గర్ పాత్రల్లో కనిపించలేదు . అయితే సమంత – నాగచైతన్యత విడాకులు తీసుకున్న తర్వాత ఆమెను హ్యూజ్ రేంజ్ లో ట్రోల్ చేశారు జనాలు . కొంతమంది పర్సనల్గా కూడా ఆమె ప్రైవేట్ విషయాలను టార్గెట్ చేశారు . అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన సమంత విడాకులు తర్వాత తను ఫేస్ చేసిన సిచువేషన్స్ గురించి సెన్సేషనల్ కామెంట్స్ చేసింది .
“విడాకులు తీసుకున్న కొద్ది టైంలోనే నాకు బన్నీ సినిమాలో నటించే ఛాన్స్ వచ్చింది. అయితే..ఊ అంటావా మామ పాట చేసే ఆఫర్ వచ్చింది. అయితే ఈ పాట నన్ను చేయొద్దు అంటూ నా కుటుంబ సభ్యులు.. ఫ్రెండ్స్ చాలా మంది దగ్గర వాళ్లు నాకు సజెస్ట్ చేశారు . ఇప్పటికే ట్రోలింగ్ ఎక్కువైపోయింది .. ఇది చేస్తే నిన్ను వ్యక్తిగతంగా కూడా బతకనివ్వరు.. చాలా హింసిస్తారు వద్దనే వద్దు బన్నీతో ఆ పాట చెయ్యొద్దు అంటూ బ్రతిమలాడుకున్నారట . కానీ సమంత మాత్రం ఊరుకోలేదట .. నేను ఏ తప్పు చేయలేదు నా వైవాహిక జీవితంలో నేను 100% న్యాయంగా ఉన్నాను విడాకులు తీసుకుంటే తప్పా..? నేనేం తప్పు చేశాను..?” అంటూ చాలా ధైర్యంగా కాన్ఫిడెంట్గా బన్నీతో ఈ పాటలో నటించిందట . ఫైనల్లీ ఈ పాట ఏ రేంజ్ లో హిట్ అయిందో అందరికీ తెలిసిందే..!!