సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక పాత తాలుక జ్ఞాపకాలు కూడా ఒక్కొక్కసారి ట్రెండ్ అవుతూ ఉంటాయి. అది ఏ కారణం చేతైనా కావచ్చు . మరీ ముఖ్యంగా స్టార్ సెలబ్రిటీస్ కి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియాలో నిరంతరం ట్రెండ్ అవుతూనే ఉంటాయి ..కొన్ని కొన్ని సార్లు ట్రోలింగ్ కూడా గురవుతాయి . కాగా రీసెంట్గా సోషల్ మీడియాలో నందమూరి హరికృష్ణ కి సంబంధించిన ఒక వార్త బాగా ట్రెండ్ అవుతుంది. హరికృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . నమ్మకానికి నిజాయితీకి మరో నిలువెత్తు నిదర్శనం . మరో మారుపేరనే చెప్పాలి . ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతాడు.. నిజాన్ని నిక్కసిగా చెప్పేస్తాడు.. తిట్టించుకోవడం తిట్టడం తప్పు చేస్తే దండించడం ఆయన అలవాటు ఈ విషయం అందరికీ తెలిసిందే ..
ఎన్నోసార్లు ఆయన మీడియా ముఖంగానే తప్పు చేసిన వాళ్ళను అడిగి కడిగి పడేసాడు .. అలాంటి ఓ ధైర్యం క్వాలిటీ ఉన్న పర్సన్. కాగా హరికృష్ణ కుమారుడు నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన ఇజం చిత్రం.. సమయంలో ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు మరోసారి వైరల్ గా మారాయి. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ మూవీ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది . యావరేజ్ గా నిలిచింది . కానీ కాన్సెప్ట్ అభిమానులకి నచ్చింది . ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఈవెంట్ కు హాజరైన హరికృష్ణ పూరి జగన్నాథ్ గారి భార్య లావణ్య గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు .
“ఒక సినిమాని నిర్మించడం అంటే అది మామూలు విషయం కాదు ..ఆఫీస్ బాయ్ కూడా ఒక చిత్రానికి చాలా ఉపయోగపడతారు.. ఆఫీస్ బాయ్ ఇచ్చే మంచి టీ తోనే మనకు ఎనర్జీ పెరుగుతుంది.. డ్రైవర్ ఒక ప్రదేశం నుంచి ఒక ప్రదేశానికి జాగ్రత్తగా తీసుకెళ్లాలి .. అయితే ఇజం చిత్ర షూటింగ్ టైంలో నేను పూరి జగన్నాథ్ ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన భార్య లావణ్య నమస్కరించి ఆప్యాయంగా పలకరించారు ..ఏం తీసుకుంటారు సార్ అని చాలా మర్యాదపూర్వకంగా మాట్లాడారు ..కాఫీ తీసుకుంటాను అమ్మా అని చెప్పినప్పుడు .. ఆమె వెంటనే కాఫీ తీసుకొచ్చింది. ఎంతో అద్భుతమైన కాఫీలు తయారు చేసింది .. ఆ కాఫీ టెస్ట్ నా జన్మలో మర్చిపోలేను.. పక్కనే ఉన్న పూరి సెటైరికల్ గా కాఫీ ఇచ్చినందుకు కూడా ఇంత పొగడాల అన్నట్టుగా చూశాడు . దీంతో హరికృష్ణ నేను ఆమె కృతజ్ఞత చెప్పుకోవాలి నేను నా మనసులో అనిపించింది చెప్పేస్తాను దాచుకోను దాచుకోలేను “అంటూ ఓపెన్ గానే చెప్పేసాడట. దీనికి సంబంధించిన వీడియో మరోసారి నెట్టింట వైరల్ గా మారింది..!!