Moviesదర్దుద్రం అంటే ఇదే గా..పవన్ కళ్యాణ్ గెలిచినా..ఆ విన్నింగ్ ని ఎంజాయ్...

దర్దుద్రం అంటే ఇదే గా..పవన్ కళ్యాణ్ గెలిచినా..ఆ విన్నింగ్ ని ఎంజాయ్ చేయలేకపోతున్న ఫ్యాన్స్..ఎందుకంటే..?

పవన్ కళ్యాణ్ ..గెలవాలి ..గెలవాలి ..గెలవాలి అంటూ అనుకున్నారు . ఫైనల్లీ ఆ దేవుడు పవన్ ఫ్యాన్స్ బాధను విన్నారు ..భారీ ఓట్ల మెజారిటీతో పవన్ కళ్యాణ్ గెలిచేలా చేశారు. పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన పవన్ కళ్యాణ్ తన ప్రత్యర్థి వంగా గీతాపై దాదాపు 74 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు . ఈ న్యూస్ నిన్నటి నుంచి బాగా టాంటాం అవుతుంది . పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఈ న్యూస్ ని బాగా ట్రెండ్ చేస్తున్నారు.

అయితే పవన్ కళ్యాణ్ గెలవాలి ..గెలవాలి అనుకున్న జనాలు .. ఫైనల్లీ పవన్ కళ్యాణ్ గెలిచిన ఆ పవన్ కళ్యాణ్ గెలుపుని ఆనందించలేకపోతున్నారు . దానికి కారణం కొత్త భయం ..పవన్ కళ్యాణ్ గెలిచాడు మినిస్టర్ పోస్ట్ కన్ఫామ్.. అసెంబ్లీ లోకి అడుగు పెట్టబోతున్నాడు.. దెన్ వాట్ నెక్స్ట్ ..? పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటిస్తాడా..? నటించడానికి కమిట్ అయిన సినిమాలు నటించి ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పబోతున్నాడా..?

ఇప్పుడు ఇలాంటి క్వశచన్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి . పవన్ కళ్యాణ్ ప్రజా సేవకుడు అవ్వాలి అని ఆలోచించారు ..ఓట్లు వేశారు .. కానీ పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీలో లేకపోతే ఆ కిక్ మిస్ అయిపోతాం. అందుకే పవన్ కి సినిమాలు మానద్దు అంటూ సజెస్ట్ చేస్తున్నారు . అయితే పవన్ కళ్యాణ్ మాత్రం సినిమాలకు గుడ్ బాయ్ చెప్పే ఆలోచనలోనే ఉన్నారట . ఇది నిజంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు ఊహించని షాక్ అని చెప్పాలి.. అందుకే పవన్ కళ్యాణ్ గెలిచిన ఆ సక్సెస్ ని ఎంజాయ్ చేయలేకపోతున్నారట పవన్ అభిమానులు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news