ఈ మధ్యకాలంలో హీరోయిన్ త్రిష పెళ్లి వార్త ఎలా ట్రెండ్ అవుతుందో ఎలా వైరల్ అవుతుందో మనం చూస్తూనే ఉన్నాం. మరీ ముఖ్యంగా తన అందంతో తన అభినయంతో సినిమా ఇండస్ట్రీని షేక్ చేసిన త్రిష ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఏ విధంగా ఆఫర్స్ అందుకుందో సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా అదే విధంగా ఆఫర్స్ అందుకుంది . కాగా పోనియన్ సెల్వన్ సినిమా ద్వారా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన హీరోయిన్ త్రిష.. ఇప్పుడు పలు సినిమాలలో నటిస్తూ బిజీబిజీగా లైఫ్‌ని ముందుకు తీసుకెళ్తుంది.
విశ్వంభరా , థగ్ లైఫ్ వంటి భారీ ప్రాజెక్టులు చేస్తూ బిజీగా గడుపుతుంది . 41 ఏళ్ళు వచ్చిన ఇంకా పెళ్లి చేసుకోకుండా సింగిల్‌గానే ఉన్న హీరోయిన్ త్రిష కి సంబంధించి ఒక వార్త ఇప్పుడు కోలీవుడ్ సర్కిల్స్‌లో బాగా ట్రెండ్ అవుతుంది. హీరోయిన్ త్రిష స్టార్ ప్రొడ్యూసర్ ని పెళ్లి చేసుకోబోతుంది అన్న వార్త ఇప్పుడు నెట్టింట బాగా వైరల్ గా మారింది. వీరిద్దరి మధ్య చాలా రోజుల నుంచి ప్రేమ యవ్వారం కొనసాగుతూ ఉందట . కోలీవుడ్ మీడియా కూడా కోడైకూస్తుంది.
త్రిష ఈ ఏడాది పెళ్లి చేసుకోబోతున్నట్లు కూడా ప్రచారం జరుగుతుంది . ఈ మేరకు ఓ మీడియా ఛానల్ తో మాట్లాడుతూ ..”నాకు ఇప్పటికే సోషల్ మీడియా చాలాసార్లు పెళ్లి చేసేసింది ..త్వరలోనే పెళ్లి చేసుకుంటున్నాను ఆ స్టార్ డైరెక్టర్ అని చెప్పి వార్తలు వినిపిస్తున్నాయి ..ఈ క్రమంలోనే ఆమె తన పెళ్లి పై క్లారిటీ ఇచ్చింది ..ప్రజెంట్ నాకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు .. ఒకవేళ చేసుకుంటే ఫస్ట్ మీడియాకే చెప్తాను అని.. ఫ్యాన్స్ కి చెప్తాను అంతవరకు కూల్ గా ఉండండి అంటూ క్లారిటీ ఇచ్చింది”. దీనితో అభిమానులు షాక్ అయిపోతున్నారు . 41 ఏజ్ వచ్చిన పెళ్ళి పై ఇంట్రెస్ట్ రాకపోవడం ఏంటి..? అంటూ ఆశ్చర్యకరంగా కామెంట్స్ చేస్తున్నారు..!!