Moviesఆ ఒక్క పని చేస్తే శ్రీలీల కెరియర్ బాగుపడినట్లే.. కానీ ఎందుకు...

ఆ ఒక్క పని చేస్తే శ్రీలీల కెరియర్ బాగుపడినట్లే.. కానీ ఎందుకు చేయట్లేదు..?

ప్రజెంట్ ఇప్పుడు శ్రీ లీలకి తమ అభిమానులు ఇలాంటి సజెషన్స్ ఇస్తున్నారు . దీంతో కన్నడ ఇండస్ట్రీలో శ్రీలీల పేరు ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది . శ్రీ లీల పేరుకి కన్నడ బ్యూటీనే.. కానీ తెలుగులో బాగా పాపులారిటి సంపాదించుకుంది. ఎంతలా అంటే ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే బడాబడా హీరోయిన్స్ ని తొక్కి పడేసింది . మంచి మంచి ఆఫర్స్ అందుకుంది . అంతేనా కోట్లకు కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటూ భారీగానే కూడబెట్టింది .

అయితే వరుసగా మూడు ఫ్లాప్ లు పడేసరికి శ్రీలీల క్రేజ్ ఢమాల్ అంటూ పడిపోయింది . ఇప్పుడు ఆమెను ఐరన్ లెగ్ అంటూ ట్రోల్ చేస్తున్నారు జనాలు . శ్రీ లీల కెరియర్ బాగుపడాలి అంటే కచ్చితంగా ఆమె కన్నడ ఇండస్ట్రీలో కూడా సినిమాల్లో నటించాలి అంటున్నారు జనాలు. కేవలం ఒక ఇండస్ట్రీపై డిపెండ్ అయితే ఏ హీరోయిన్ సక్సెస్ అవ్వలేదు అని.. వేరే భాషలపై కూడా ఫోకస్ చేసి అక్కడ అవకాశాలు సంపాదించుకుంటే శ్రీ లీల లైఫ్ సెటిల్ అయిపోతుంది అని ఫ్యాన్స్ సజెస్ట్ చేస్తున్నారు .

చూద్దాం మరి శ్రీలీల ఈ నిర్ణయాన్ని ఎంతవరకు పరిగణలోకి తీసుకుంటుందో..? గతంలో బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి అవకాశాలు వచ్చిన శ్రీలీల సున్నితంగా రిజెక్ట్ చేసింది అంటూ ప్రచారం జరిగింది . మరి ఇప్పుడు అలాంటి అవకాశాలు వచ్చే పరిస్థితి అయితే లేదు. ఏం చేస్తుందో ఈ బ్యూటీ వేచి చూద్దాం..! ప్రసెంట్ అయితే కోలీవుడ్ ఇండస్ట్రీలో మూడు సినిమాలకు కమిట్ అయ్యింది ఈ బ్యూటీ.. మూడు కూడా బడా స్టార్స్ తోనే కావడం గమనార్హం…!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news