మనం తీసుకునే ఒక్క నిర్ణయం మన లైఫ్ ని మార్చేస్తుంది. అది ఏ విషయంలోనైనా సరే .. అందుకే ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు ఆలోచించి ఆచితూచి తీసుకోవాలి అంటూ ఉంటారు మన ఇంట్లోని పెద్దవాళ్లు. కాగా రీసెంట్ గా ఇప్పుడు పూజా హెగ్డే తీసుకున్న నిర్ణయం కుర్రాళ్లకు మళ్ళీ ఆమె పేరు గుర్తుచేసేలా చేసింది. ఆమె తీసుకున్న నిర్ణయం ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో హైలెట్‌గా మారింది. సాధారణంగా హీరోయిన్స్ ఐటమ్ సాంగ్ నటించడానికి ఇష్టపడరు. కొంతమంది స్టార్ బ్యూటీస్ మాత్రం చేస్తూ ఉంటారు.
అయితే క్రేజ్ ఉన్నప్పుడు హీరోయిన్ ఐటెం సాంగ్స్ చేయడం వేరు ..ఆ కిక్ వేరేలా ఉంటుంది . క్రేజ్ తగ్గిపోయినాక హీరోయిన్ ఐటెం సాంగ్ చేయడం వేరు మరోలా ఉంటుంది. పూజ హెగ్డే క్రేజ్ ఉన్నప్పుడు రంగస్థలం సినిమాలో జిగేలురాణి అనే సాంగ్ లో నటించి మెప్పించింది. కాగా ఆ తర్వాత ఆమె ఐటమ్ సాంగ్ జోలికి పోలేదు. ఇప్పుడు ఇన్నాళ్ళకి మళ్లీ క్రేజ్ తగ్గిపోయాక ధమాల్ అంటూ ఫ్యాన్ ఫాలోయింగ్ పడిపోయాక .. ఆమె మళ్లీ ఐటెం సాంగ్ లో కనిపించడానికి ఓకే చేసినట్లు ప్రచారం జరుగుతుంది .
మనకు తెలిసిందే పూజా హెగ్డే ఖాతాలో ప్రజెంట్ ఆఫర్స్ లేవు ..వచ్చిన అరా కొరా ఆఫర్స్ కూడా వచ్చినట్లే వచ్చి చేజారిపోతున్నాయి. ఈ క్రమంలోనే పూజ హెగ్డే ఖాతాలోకి ఓ బంపర్ ఆఫర్ వచ్చి చేరినట్లు బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతుంది . ఆమె బడా బాలీవుడ్ స్టార్ తో స్క్రీన్ షేర్ చేసుకోబోతుందట . అది కూడా ఐటెం సాంగ్ . ప్రజెంట్ ఇదే న్యూస్ బాలీవుడ్ ఇండస్ట్రీని కుదిపేస్తుంది . అసలు ఆఫర్స్ లేని పూజా హెగ్డే కు ఇంత పెద్ద ఆఫర్ ఎలా వచ్చింది? దీని వెనక ఏ రీజన్ ఉంది..? అనే విధంగా చర్చించుకుంటున్నారు . మాయ చేసిందో..? మెస్ మరైజ్ చేసిందో..? మెల్ట్ చేసిందో ..? మొత్తానికి ఆఫర్ అయితే పట్టేసింది . చూద్దాం మరి ఈ ఆఫర్‌తో పూజ తన కాతాలో మరిన్ని ఆఫర్స్ దక్కించుకుంటుందో లేదో..??