Movies"హేమ ను టచ్ చేస్తే ఒప్పుకోను"..కాల్ చేసి పోలీసులకు వార్నింగ్ ఇస్తున్న...

“హేమ ను టచ్ చేస్తే ఒప్పుకోను”..కాల్ చేసి పోలీసులకు వార్నింగ్ ఇస్తున్న బడా పొలిటీషియన్..!?

బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ రోజుకో ట్విస్ట్ తో ఎలా అభిమానులకి షాక్ ఇస్తుందో చూస్తున్నాము మరీ ముఖ్యంగా టాప్ మోస్ట్ సెలబ్రిటీస్ 100 మందికి పైగా ఇదే పార్టీలో పాల్గొని భారీ ఎత్తున డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులకి సమాచారం అందడంతో ఆ విషయాన్ని విచారించగా నిజమే అంటూ బయటపడడంతో ఇప్పుడు ఈ బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ సంచలనంగా మారింది . బడా స్టార్ సెలబ్రిటీస్ కి కూడా బెంగళూరు క్రైమ్ బ్రాంచ్ పోలీస్ ఆఫీసర్స్ నోటీసులు పంపారు. వాళ్లలో మన తెలుగు నటి హేమ కూడా ఉండడం గమనార్హం.

అయితే పోలీసుల విచారణకు నటి హేమ అటెండ్ కాకపోవడం భారీ షాక్ ఇచ్చింది . వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నాను అంటూ ఓ లేఖ రాసింది . అయితే ఆ లేఖను పరిగణలోకి తీసుకోలేదు పోలీసులు. కాగా ఇప్పుడు సోషల్ మీడియాలో న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. బెంగుళూరు సిసిబి పోలీసులు హాయ్ మని ఈ కేసు నుంచి తప్పించేలా ఓ బడా పొలిటికల్ లీడర్ ట్రై చేస్తున్నట్లు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. హేమను అరెస్ట్ చేయవద్దు అని ఆమె విచారణ చేసి మాత్రమే వదిలేయండి అని ఆమె పేరు బయటకు రాకుండా చూడాలి అని సిసిబి పోలీసులకి బాగా ఒత్తిడి తీసుకొస్తున్నట్లు కన్నడ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి .

పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ కారణంగానే హేమ ఈ పోలీసుల విచారణకు హాజరు కాలేదు అంటూ ప్రచారం జరుగుతుంది . అంతేకాదు ఇప్పుడు హేమను వదిలేయమంటూ సిసిబి పోలీస్ ఆఫీసర్లకు పదేపదే కాల్ చేస్తున్న లీడర్ కూడా ఓ పెద్ద బడాతోపైన వ్యక్తి అని తెరవెనుక చాలా బ్యాక్ గ్రౌండ్ ఉందని .. ఆకారణంగానే పోలీసులు చూసి చూడనట్లు హేమా విషయంలో బిహేవ్ చేస్తున్నారు అన్న వార్త ఇప్పుడు సినీ ఇండస్ట్రీని కుదిపేస్తుంది . ఒక తెలుగు నటి కి సంబంధించి కన్నడ మీడియాలో ఇలాంటి రకాల వార్తలు వినిపిస్తూ ఉండడం తెలుగు ఇండస్ట్రీ పరువు పోయినట్లు అవుతుంది అంటూ ఫ్యాన్స్ మండిపడుతున్నారు . మొత్తం 100 మందికి పైగా రేవ్ పార్టీలో పాల్గొనగా 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్టు బ్లడ్ శాంపిల్స్ లో బయటపడ్డాయి . బెంగళూరు సిసిబి పోలీసులు విచారణలో ఈ విషయం బయటపడింది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news