Moviesఆ చిరకాల కోరికను జూనియర్ ఎన్టీఆర్ అలా తీర్చుకోపోతున్నాడా.. నందమూరి హీరో...

ఆ చిరకాల కోరికను జూనియర్ ఎన్టీఆర్ అలా తీర్చుకోపోతున్నాడా.. నందమూరి హీరో అనిపించుకున్నాడుగా..!

జూనియర్ ఎన్టీఆర్ ప్రెసెంట్ ఎలాంటి ప్రాజెక్ట్స్ లో బిజీగా ఉన్నాడో మనకు తెలిసిందే . బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ కి కమిట్ అవుతూ కమిట్ అయిన సినిమాలు సెట్స్ పైకి తీసుకొస్తూ తనదైన స్టైల్ లో ముందుకు దూసుకెళ్తున్నాడు . కాగా రీసెంట్గా జూనియర్ ఎన్టీఆర్ తన బర్త్డ డేను చాలా చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నాడు . కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తూ తన 41వ పుట్టినరోజుని సరదాగా గడిపారు . ఈ క్రమంలోనే సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఆయన ఫ్యాన్స్ ..ఫ్యామిలీ మెంబర్స్ ..వెల్ విషర్స్.. అందరూ కూడా రకరకాలుగా విషెస్ అందించారు .

ఈ క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించిన పలు ఇంట్రెస్టింగ్ విషయాలు కూడా నెట్టింట బాగా ట్రెండ్ అయ్యాయి. ఆయనకు సంబంధించిన ఒక వీడియో బాగా వైరల్ గా మారింది. గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జూనియర్ ఎన్టీఆర్ నీ హోస్ట్ ..”మీ ఫేవరెట్ క్రష్ ఎవరు అని అడగ్గా ..శ్రీదేవి అంటూ ఆన్సర్ ఇచ్చాడు”. ” నా వయసు చిన్నదే ఆమె ఏజ్ పెద్దది .. కానీ నాకు ఆమెతో స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఉంది. ఆమె పక్కన నటించాలని ఉంది . అందుకోసం నేను తాత గెటప్ లో కనిపించడానికి కూడా సిద్ధం అంటూ చెప్పుకొచ్చారు”.

అఫ్కోర్స్ శ్రీదేవి ఇప్పుడు మన మధ్య లేరు. కానీ జూనియర్ ఎన్టీఆర్ ఆ ఇంటర్వ్యూలో పాల్గొన్న టైంలో శ్రీదేవి బ్రతికే ఉన్నారు . కాగా జూనియర్ ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరోసారి వైరల్ గా మారాయి. అంతేకాదు పోనీలే తల్లితో స్క్రీన్ షేర్ చేసుకోలేకపోయిన కూతురితో చేసుకుంటున్నావుగా అంటూ సపోర్ట్ చేస్తున్నారు. మరికొందరు జూనియర్ ఎన్టీఆర్ అలా తన కోరికను తీర్చుకోబోతున్నాడు అని కామెంట్స్ పెడుతున్నారు . కాగా దేవరతో పాటు వార్ 2 సినిమాను కూడా పార్లర్గా సెట్స్ పైకి తీసుకొచ్చాడు జూనియర్ ఎన్టీఆర్ . ఆగస్టు లో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కే సినిమాను కూడా సెట్స్ పైకి తీసుకోరాబోతున్నాడట..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news