కాజల్ అగర్వాల్ .. టాలీవుడ్ చందమామ ..సెక్సీ ఫిగర్ ..అందాల ముద్దుగుమ్మ ఒకటా..? రెండా..? కాజల్ గురించి చెప్పుకుంటూ పోతుంటే రోజులు రోజులు సరిపోతాయి . అలాంటి ఓ చరిత్ర కలిగిన హీరోయిన్ . లక్ష్మీ కళ్యాణం అనే సినిమా ద్వారా చాలా ముద్దు ముద్దుగా కనిపిస్తూ క్యూట్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో అందరినీ ఆకట్టుకున్న ఈ బ్యూటీ ఆ తర్వాత మగధీరతో మిత్రవిందా – ఇందు పాత్రలో నటించి మెప్పించింది . సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది . పలు బడా బడా సినిమాలలో నటించి తన తలరాతను తానే మార్చేసుకుంది .
అయితే సెకండ్ ఇన్నింగ్స్ లోను అదే హవా కొనసాగించాలి అని బాగా బాగా ట్రై చేస్తుంది ఈ అందాల ముద్దుగుమ్మ . కాజల్ అగర్వాల్ సెకండ్ ఇన్నింగ్స్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటించిన సినిమా సత్యభామ . మే 31న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది . సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పలు ఇంటర్వ్యూలకు హాజరవుతుంది కాజల్ . ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ కి తనకు మధ్య ఉన్న సీక్రెట్ బాండింగ్ గురించి బయటపెట్టింది .
వాళ్ళిద్దరూ చాలా చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అనే విషయాన్ని కన్ఫామ్ చేసింది. అంతేకాదు అల్లు అర్జున్ ఇచ్చిన సలహాను ఇప్పటికి పాటిస్తుందట. ఏదైనా సినిమా షూట్ కంప్లీట్ అయ్యాక ఆ మూడ్ నుంచి అప్పుడే బయటికి రాకూడదట ఒక రెండు మూడు నిమిషాల పాటు అదే కంటిన్యూ చేయాలట . అది ఎటువంటి సిచువేషన్ అయినా సరే ..అప్పుడే ఎడిటింగ్లో బాగా ఉపయోగపడుతుందట. ఈ విషయం బన్నీన స్వయంగా కాజల్కు చెప్పారట . ఆ సలహాను కాజల్ ఇప్పటికీ కూడా పాటిస్తుందట . ఇదే విషయాన్ని కాజల్ కూడా చెప్పుకు రావడం గమనార్హం..!!