ఎప్పుడు .. ఎవరి.. టైం ఎలా మారిపోతుందో అని చెప్పడం చాలా చాలా కష్టం . అసలు ఎవరు గ్రహించలేరు ..ఊహించలేరు . మనమిది జరుగుతుంది అంటే .. అది ఖచ్చితంగా జరగకుండా పోవచ్చు . ఒకవేళ జరగదు అనుకుంటే కొన్నిసార్లు జరిగే ఛాన్సెస్ ఉంటాయి. మన లైఫ్ లో కూడా ఇలా మనం ఎన్నెన్నో సిచువేషన్స్ పరిస్థితులను ఫేస్ చేస్తూ ఉంటాం . అయితే ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోయిన్గా ఉన్న అందాల ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్ సైతం అదే టాప్ సిచువేషన్ ఫేస్ చేసిందట . దానికి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు నెట్టీంట వైరల్ గా మారింది. టాలీవుడ్ ఇండస్ట్రీలోకి లక్ష్మీ కళ్యాణం అనే సినిమా ద్వారా అడుగు పెట్టింది కాజల్ అగర్వాల్ . ఈ సినిమాతో ఆమె ఎంత పెద్ద సూపర్ డూపర్ హిట్ తన ఖాతాలో వేసుకుందో తెలిసిందే.
ఆ తర్వాత మగధీర సినిమాతో తన తలరాతను తానే మార్చేసుకుంది . రీసెంట్గా సత్యభామ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆలీతో సరదాగా అనే షోకి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూలో ఆలీ అడిగిన ప్రశ్నలకు సరదా సరదాగా సమాధానం చెప్పింది. అసలు ఫస్ట్ లక్ష్మి కళ్యాణంలో ఆఫర్ ఎలా వచ్చింది ..? అని ఆలీ ప్రశ్నించగా..” అది చాలా డిఫరెంట్ .. నేను ఏడవడం వల్ల నాకు ఆఫర్ వచ్చింది అని ఇప్పటికీ మా ఇంట్లో వాళ్ళు నన్ను ఆటపట్టిస్తూ ఉంటారు. ఆడిషన్ లో ఏం అడుగుతారు ..? ఎలాంటి సీన్స్ చేయమంటారు ..? అని బాగా టెన్షన్ పడ్డాను “..
“కానీ నన్ను ఏ సీన్స్ చేయమనలేదు .. ఒకసారి ఏడవమన్నారు.. నార్మల్ సిచువేషన్ లో ఎలా ఏడుస్తాం..? అసలు నా వల్ల కాలేదు అప్పుడే మా డాడీ దగ్గరికి వెళ్ళాను. నేను నిజంగానే బాధపడే ఒక ఇన్సిడెంట్ గురించి చెప్పారు .. ఆటోమేటిక్‌గా ఏడుపొచ్చేసింది. అక్కడే ఏడ్చేశాను. అంతే మూవీకి సెలెక్ట్ చేసుకున్నారు ..ఆ ఏడుపే నా లైఫ్‌ను మార్చేసింది.. నన్ను ఇప్పుడు ఇంత పెద్ద హీరోయిన్గా మీ ముందు నిలబెట్టింది.. అంటూ కాజల్ అగర్వాల్ చెప్పుకొచ్చింది . దీంతో కాజల్ ఏడవడం వల్లనే సినిమాలో అవకాశాలు వచ్చాయి అంటూ సరదాగా ఆటపట్టిస్తున్నారు జనాలు”..!!