సాయి పల్లవి .. ఓ అందాల హీరోయిన్ .. కేవలం హీరోయిన్ అంటే ఇండస్ట్రీలో అందాల పాత్రలు చేసే వరకు మాత్రమే పనికొస్తుంది అంటూ ఒక అపోహ ఉండేది . అయితే ఆ భ్రమను పోగొట్టేసింది హీరోయిన్ సాయి పల్లవి . హీరోయిన్స్ అంటే కేవలం అందం మాత్రమే కాదు నటనపరంగా ఉన్న రోల్స్ కూడా చేయగలరు అంటూ ప్రూవ్ చేసింది . అంతేకాదు సాయి పల్లవి తన కెరియర్ లో చూస్ చేసుకున్న ప్రతి ఒక్క సినిమాలోని కంటెంట్ ఎంత డిఫరెంట్ గా ఉంటుందో మనకు తెలిసిందే.
మరి ముఖ్యంగా సాయిపల్లవి నటన పర్ఫామెన్స్ అభిమానులకి బాగా నచ్చేస్తూ ఉంటుంది . అయితే తాను తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండే సాయి పల్లవి రొమాంటిక్ ఎక్స్పోజింగ్ సీన్స్ లో నటించదు అన్న విషయం అందరికీ తెలిసిందే. అంతేకాదు తనకు కథ నచ్చకపోతే అసలు ఆ సినిమా వైపు కూడా చూడదు . అలాంటి సాయి పల్లవి ఒక డైరెక్టర్ ని పదే పదే బ్రతిమిలాడుకుందట ..ఆయన మరెవరో కాదు. ప్రేమమ్ మూవీ చిత్ర దర్శకుడు అల్పోన్సే పుతేరన్.
ఆడిషన్స్ ద్వారా సాయి పల్లవికి ప్రేమమ్ మూవీలో ఛాన్స్ వచ్చిన… సాయి పల్లవికి మాత్రం నమ్మకం ఉండేది కాదట. దానికి కారణం ఆమె మొటిమలు. ఈ క్రమంలో మాటిమాటికి దర్శకుడు అల్పోన్సే వద్దకు వెళ్లి బాగా బాగా బ్రతిమిలాడేదట. నిజంగా మీరు నన్ను ఈ సినిమా నుండి తీసేయరు కదా..? చెప్పండి చెప్పండి అని ఆందోళన చెందేదట. డైరెక్టర్ ఎన్ని సార్లు చెప్పిన అలాంటిదేమీ లేదు అని వినేది కాదట. ఈ సినిమాకు నువ్వే హీరోయిన్ అని అల్పోన్సే గట్టిగా అరిచి చెప్పాడట. ప్రేమమ్ మలయాళంలో భారీ హిట్ కొట్టింది.