సినిమా ఇండస్ట్రీలో పరిస్థితులు ఎప్పుడు ఎలా అయినా మారిపోవచ్చు . దీని గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు . అందరికీ తెలిసిన విషయమే . అయితే చాలామంది అనుకుంటూ ఉంటారు .. కేవలం కామన్ హీరోస్ .. ఇండస్ట్రీలోకి సపోర్ట్ లేకుండా వచ్చిన చిన్న హీరో సినిమాలే ఫ్లాప్ అవుతూ ఉంటాయి అని ..కానీ అది తప్పు.. అది ముమ్మాటికి తప్పే .. ఎందుకంటే కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఎన్నో సినిమాలు ఇండస్ట్రీలో ఫ్లాప్ అయ్యాయి . ఆశ్చర్యం ఏంటంటే వంద రోజులు ఆడిన సినిమాలు కూడా ఫ్లాప్ అవ్వడం ఫ్యాన్స్ కి మర్చిపోలేని పీడకలనే చెప్పాలి. ఆ లిస్టులో మన స్టార్ హీరోలు కూడా ఉండడం గమనార్హం . వాళ్ళు ఎవరో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..!
అంజి: టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న చిరంజీవి తన కెరీర్ లో బిగ్ డిజాస్టర్ సినిమాగా ఏదైనా చెప్పుకునే మూవీ ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా అంజి అనే చెప్పాలి . అద్భుతమైన గ్రాఫిక్స్ తో కోట్ల భారీ బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా భారీ పరాభావాన్ని ఎదుర్కొంది . కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 2004 జనవరి 15వ తేదీ విడుదల అయింది . అయితే ఈ సినిమా రిలీజ్ అయ్యే ముందు వరకు కూడా హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయి . కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత తుస్సుమంటూ తుడిచిపెట్టుకుపోయింది . కొన్ని సెంటర్లలో ఈ సినిమా 100 రోజులు ఆడింది. కానీ ఈ సినిమా ఫ్యాన్స్ హై ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కాలేక ఫ్లాప్ అయింది.
ఖలేజా: టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న మహేష్ బాబు ఈ సినిమాలో హీరోగా నటించారు . ఫుల్ లెంత్ కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా పై ప్రజలు ఓ రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేశారు . మరీ ముఖ్యంగా మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబో అనగానే ఓ రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేసేసారు .ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు ముందు వరకు కూడా ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఊహించుకున్నారు . సినిమా రిలీజ్ అయ్యాక అసలు ఈ సినిమాలో కథ ఏముంది..? అనేది అభిమానులకు కూడా అర్థం కాలేదు. మరీ ముఖ్యంగా మహేష్ బాబుని దేవుడిని చేసి చూపించడం లాస్ట్ లో బిస్కెట్ గా మారింది. ఈ సినిమా కూడా ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కాలేక డిజాస్టర్ గా మారింది . ఆశ్చర్యం ఏంటంటే ఈ సినిమా కూడా కొన్ని సెంటర్లలో వంద రోజులు ఆడింది.
మున్న : టాలీవుడ్ ఇండస్ట్రీలో రెబల్ స్టార్ గా పాపులారిటి సంపాదించుకున్న ప్రభాస్ నటించిన మూవీ ప్రభాస్ కెరియర్ లోనే ఫుల్ టు ఫుల్ రివేంజ్ కమర్షియల్ మూవీగా ఈ సినిమా తెరకెక్కింది . వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీని దిల్ రాజు ఎంతో ఇష్టంగా నిర్మించారు. 2007 మే 2వ తేదీన థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా పరమ చెత్త టాక్ దక్కించుకుంది . ఈ సినిమాల్లో ప్రభాస్ లుక్స్ కి మంచి క్రేజ్ ఏర్పడిన ..పాటలు హిట్ అయిన కథ మాత్రం జనాలను ఆకట్టుకోలేకపోయింది . ఈ సినిమా 9 కేంద్రాలలో 100 డేస్ ఆడడం అప్పట్లో సంచలనంగా మారింది . కానీ ప్రభాస్ ఫ్యాన్స్ ని ఆకట్టుకోలేకపోయింది..!
స్పైడర్ : మహేష్ బాబు హీరోగా కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ మురగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 2017 సెప్టెంబర్ 27వ తేదీన రిలీజ్ అయింది. కమర్షియల్ గా ఈ సినిమా డిజాస్టర్ గా మారింది. కానీ నెల్లూరులోని రామరాజు థియేటర్లో మాత్రం ఏకంగా వంద రోజులు పైనే ఆడింది. ఈ సినిమా గురించి ఫాన్స్ ఓ స్థాయిలో ఎక్స్పెక్ట్ చేశారు . లాస్ట్ లో మహేష్ బాబు పెర్ఫార్మెన్స్ బాగున్నప్పటికీ ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేసిన ట్వీస్ట్ లు లేకపోవడంతో సినిమా ఫ్లాప్ అయింది . ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించింది..!!