ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా వైరల్ గా మారింది. ప్రముఖ దర్శకుడు సుకుమార్ కుమార్తె సుకృతి వేణి..ఈ పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో మారుమ్రోగిపోతుంది . ఆమె ఎనిమిదవ తరగతి చదువుతున్న విషయం చాలామందికి తెలుసు. ఆమె ఉత్తమ పరిచయ బాలనటిగా బెస్ట్ డెబ్యూ చైల్డ్ ఆర్టిస్ట్ దాదాసాహెబ్ ఫిలిం ఫెస్టివల్ లో పురస్కారం అందుకుంది . దీంతో సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో సుకుమార్ – తబితల ముద్దుల కూతురు సుకృతి వేణి పేరు ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతుంది.
సుకుమార్ ఎంత పెద్ద స్టార్ డైరెక్టర్ అనే విషయం మన అందరికీ తెలిసిందే . జనాల నాడిపట్టి సినిమాలను తెరకెక్కించే వన్ ఆఫ్ ద టాప్ డైరెక్టర్. పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు సంపాదించుకున్నాడు . త్వరలోనే పుష్ప2తో గ్లోబస్థాయిలో తన పేరు మారు మ్రోగిపోయేలా చేసుకోబోతున్నాడు . కాగా ఇలాంటి క్రమంలోనే సుకుమార్ కూతురు సుకృతి వేణి తన సత్తాను చాటడం ఆయనకు మరింత కలిసి వచ్చింది .
గాంధీ తాత చెట్టు అనే చిత్రంలో ని నటనకు సుకృతి వేణి ఈ అవార్డ్ సొంతం చేసుకుంది. పర్యావరణ పరిరక్షణ ప్రధాన అంశంగా పద్మావతి మల్లాది తెరకెక్కించిన ఈ సినిమా పలు అంతర్జాతీయ సినీ వేదికలపై మెరిసింది . త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మైత్రి మూవీ మేకర్స్ సుకుమార్ రైటింగ్స్ గోపి టాకీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి . చాలా చిన్న ఏజ్ లోను సుకృతి వేణి తన సత్తా చాటడంతో.. జనాలు ఓ రేంజ్ లో ఆమెను పొగిడేస్తున్నారు. సుకుమార్ ఫ్యాన్స్ ఈ న్యూస్ ని బాగా ట్రెండ్ చేస్తూ తండ్రికి తగ్గ తనయ అంటూ ఓ రేంజ్ లో ప్రశంసిస్తున్నారు..!
‘గాంధీ తాత చెట్టు’ సాధించిన మరికొన్ని అవార్డులివీ.. ‘దుబాయ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్,’ ‘ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా’ అవార్డులూ సుకృతికి వరించాయి.