ఇండస్ట్రీలో ఎప్పుడు ఏమైనా జరగొచ్చు అని చాలామంది అంటూ ఉంటారు . బహుశా అది నిజమే అని అనిపిస్తుంది ఈ హీరోయిన్ మేటర్ లో.. ప్రజెంట్ ఇండస్ట్రీలో ఈ న్యూస్ బాగా బాగా వైరల్ గా మారింది. ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ పెళ్లి చేసుకోబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది . అయితే అమ్మడు ఏ 28 లోనో 32 లోను 35 లోనో పెళ్లి చేసుకున్న పెద్దగా ఆశ్చర్యపోనవసరం లేదు . ఏకంగా 40 క్రాస్ చేసిన తర్వాత పెళ్లి చేసుకోవడానికి డిసైడ్ అయినట్లు సోషల్ మీడియాలో టాలీవుడ్ సర్కిల్స్ లో వార్తలు వినిపిస్తూ ఉండడంతో జనాలు షాక్ అయిపోతున్నారు.
ఇంతకీ ఆ ముద్దుగుమ్మ ఎవరా..? అని అనుకుంటున్నారా ఆమె మరెవరో కాదు హీరోయిన్ సదా . ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ టాలీవుడ్ బాలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. గతంలో సినిమా ఇండస్ట్రీని తన అంద చందాలతో ఊపు ఊపేసిన ఈ బ్యూటీ ఇప్పుడు పలు షోస్ కి జడ్జిగా చేస్తుంది . యూట్యూబ్లో కూడా తనదైన స్టైల్ లో అభిమానులతో నిరంతరం టచ్ లో ఉంటుంది . తాజాగా సదా పెళ్లి వార్తలు నెట్టింట వైరల్ గా మారాయి .
గతంలో ఆమె ఓ హీరోని ప్రేమించింది కొన్ని కారణాల వల్ల బ్రేకప్ అయ్యింది అంటూ పుకార్లు బాగా వినిపించాయి. అందులో ఎంత నిజం ఉందో ఆ దేవుడికే తెలియాలి . ఎప్పుడూ సదా ఆ వార్తలపై స్పందించలేదు . తాజాగా సదా పెళ్లి చేసుకోబోతుంది అంటూ కోలీవుడ్ మీడియా కూడా కోడై కూస్తుంది . తమిళనాడుకు చెందిన ఒక బిగ్ బడా బిజినెస్ మ్యాన్ ను సదా పెళ్లి చేసుకోబోతుందట .
ఇది టోటల్గా పెద్దలు కుదిరిచిన వివాహమే అంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి . మొదటి నుంచి పెళ్లిపై పెద్దగా ఇంట్రెస్ట్ చూపించిన సదా తల్లిదండ్రుల కోసమే పెళ్లి చేసుకోబోతుంది అంటూ కూడా టాక్ వినిపిస్తుంది . త్వరలోనే దీనిపై అఫీషియల్ ప్రకటన రాబోతుందట. అంతేకాదు పెళ్లి తర్వాత కూడా సదా ఇండస్ట్రీలోనే కొనసాగిపోతుంది అంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే సదా ఫాన్స్ మాత్రం ఈ వార్త విని ఇదంతా ఫేక్ అంటున్నారు . ఆమె పెళ్లి చేసుకుంటే ఆమె చెబుతుంది ..మీకు ఎందుకు అంత తొందర అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు..!!