Gossipsప్రముఖ సింగర్ ఆత్మహత్య... టాలీవుడ్ లో కలకలం..!

ప్రముఖ సింగర్ ఆత్మహత్య… టాలీవుడ్ లో కలకలం..!

ఈ రోజూ ఉదయం టాలీవుడ్ యువ సంగీత దర్శకుడు అనురాగ్ వినీల్ తన నివాసంలోనే ఆత్మహత్య చేసుకున్నారు. అనురాగ్ హైదరాబాద్ శివారు ప్రాంతం లో ఉన్న నాగోల్ లో ని మమతా నగర్ లో నివాసం ఉంటున్నారు. అనురాగ్ పలు ప్రైవేటు ఆల్బమ్స్ కి సంగీతం వహించారు. వాటిలో నీలాకాశం, రిపబ్లిక్ డే స్పెషల్‌గా వందేమాతరం అనే పాట, ఓ చెలియా అనే పాటలు ఎంతో జన ఆదరణ పొందాయి. అయితే అనురాగ్ గత కొంత కాలంగా సరైన అవకాశాలు లేక మరియు ఇతర సమస్యల వలన మద్యం మరియు మాదక ద్రవ్యాలకు బానిసైనట్టు స్థానికులు వివరించారు.

ఇవే కాకుండా కొంత మంది వ్యక్తులు అనురాగ్ ని వేధిస్తున్నారని సమాచారం. అయితే అనురాగ్ సూసైడ్ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పోలీస్ విచారణలో ఆత్మహత్య కి గల అసలు కారణం తెలిసే అవకాశం ఉంది. అనురాగ్ సూసైడ్ వెనుక ఎవరైనా ఉన్నారా లేదా అనే కోణం లో కూడా పోలీస్ వారు విచారణ చేస్తున్నారని సమాచారం. అయితే తన ఆత్మహత్య జరిగిన విధానం పై పలు అనుమానాలు ఉన్నాయని స్థానికులు చెప్పటం కీలకంగా మారింది.

anurag-new

Latest news