శ్రీముఖి ..ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ కి మించిపోయే రేంజ్ లో దూసుకుపోతున్న పేరు . హోస్టుగా తన కెరియర్ స్టార్ట్ చేసి ఆ తర్వాత పలు సినిమాలలో సిస్టర్ క్యారెక్టర్స్ చేసి మెప్పించిన శ్రీముఖి పలు సినిమాలలో బోల్డ్ క్యారెక్టర్స్ కూడా చేసింది . ఫన్నీ క్యారెక్టర్స్ చేసి కూడా మెప్పించింది . అయితే వెండి తెరపై కన్నా బుల్లితెరపైనే బాగా సక్సెస్ అయింది ఈ అందాల ముద్దుగుమ్మ . మరీ ముఖ్యంగా చేతునిండా షోలతో బిజీ బిజీగా దూసుకెళ్తున్న యాంకర్ శ్రీముఖి పటాస్ అనే కామెడీ షో ద్వారా బాగా పాపులారిటీ సంపాదించుకుంది అన్న విషయం మనకు తెలిసిందే.
రీసెంట్ గా శ్రీముఖి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి . ప్రస్తుతం స్టార్ మా పరివారం విత్ స్టార్ వార్స్ అనే షోలో యాంకర్ గా చేస్తుంది ఈ ముద్దుగుమ్మ . ఎప్పటిలాగే ఈమె పెళ్లిపై ఈ షోలో ప్రశ్నలు ఎదురయ్యాయి . అయినప్పటికీ అవి పట్టించుకోకుండా చాలా ప్రశాంతంగా షోను ముందుకు తీసుకెళ్తూ వచ్చింది. తాజాగా స్టార్ మా పరివారం విత్ స్టార్ వార్స్ అనే ప్రోగ్రాంలో భాగంగా శ్రీముఖి మాట్లాడిన మాటలను ట్రోల్ చేస్తున్నారు జనాలు . ఓ ఎపిసోడ్లో సీరియల్స్ అత్తా కోడలుగా నటించే జోడిలను తీసుకువచ్చారు . ఇందులో భాగంగా సీరియల్ నటి జ్యోతి రెడ్డి స్టేజ్ మీదకు వచ్చి..
” నేను కోడల్ని వంట చేయిస్తా అని అంటూ వస్తుంది ..అప్పుడే శ్రీముఖి నైంటీ వేసా అని షాక్ అవుతుంది. దీంతో జ్యోతి రెడ్డి మీరు అలా చేస్తారేమో అని టంగ్ స్లిప్ అయింది. అయితే వెంటనే శ్రీముఖి మాట అందుకొని ఏంటి నాకు ఇంకా పెళ్లి కాలేదు అంటూ కౌంటర్ వేస్తుంది. జ్యోతి రెడ్డి వెంటనే వాట్ నీకు ఇంకా పెళ్లి కాలేదా..? అంటూ చాలా వ్యంగంగా వెటకారంగా అడుగుతుంది . దీంతో శ్రీముఖి ఎందుకు మీరంతా అలా వింతగా అడుగుతున్నారు..? నాకు ఏదైనా ప్రాబ్లం ఉంది అని అనుకుంటున్నారా..? అలాంటిది ఏదీ లేదు నేనే కావాలని పెళ్లికి దూరంగా ఉంటున్న.. అంటూ క్లారిటీ ఇస్తుంది”.
అసలు శ్రీముఖి అక్కడ అలాంటి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు . తన పెళ్లి తన ఇష్టం .. అది తన పర్సనల్ ప్రైవేట్ మేటర్ . మరి ఎందుకు ఆమె తన పెళ్లి అనే ప్రైవేట్ మేటర్ ని షోస్ లోకి తీసుకొచ్చి టిఆర్పిసి పెంచడానికి చూస్తుంది అంటూ శ్రీముఖి ఫ్యాన్స్ మండిపడుతున్నారు..!!