నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా జయేంద్ర డైరక్షన్ లో వచ్చిన సినిమా నా నువ్వే. కళ్యాణ్ రామ్ ను లవర్ బోయ్ గా సరికొత్తగా చూపించిన ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటించింది. పిసి శ్రీరాం సినిమాటోగ్రఫీ అందించిన ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వస్తుందు. మరి ఈ సినిమా ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం.
కథ :
ఆర్జేగా పనిచేసే మీనా వాలెంటైన్స్ డే నాడు స్పెషల్ షో చేస్తుంటుంది. ఆ క్రమంలోనే తన లవ్ స్టోరీ గురించి చెబుతుంది. తను ప్రేమించిన వరుణ్ (కళ్యాణ్ రాం) గురించి ఫ్లాష్ బ్యాక్ చెబుతుంది మీనా. డెస్టినీ మీద బాగా నమ్మకం ఉన్న మీనా.. అసలు డెస్టినీ ఏం లేదు అనే క్యారక్టర్ తో వరుణ్. అలా వారిద్దరు దూరమవుతారు. వరుణ్ ను ప్రేమిస్తూ ఎప్పటికైనా తన ప్రేమకు ఓకే చెప్తాడని చూస్తుంది మీనా. ఇంతకీ వరుణ్ కు మీనా అంటే ఇష్టం లేదా..? వరుణ్, మీనా ల లవ్ స్టోరీకి ముగింపు ఏంటి..? అన్నది సినిమా కథ.
నటీనటుల ప్రతిభ :
వరుణ్ పాత్రలో కళ్యాణ్ రామ్ చాలా సెటిల్డ్ పర్ఫార్మెన్స్ చేశాడు. కెరియర్ లో కొత్తగా ట్రై చేయడంలో ఇప్పుడు నందమూరి కళ్యాణ్ రామ్ కూడా రెడీ అయ్యాడని చెప్పొచ్చు. మిల్కీ బ్యూటీ తమన్నా సినిమాకు చాలా ప్లస్ అయ్యింది. తమన్నా గ్లామర్ ఫ్యాన్స్ ను అలరిస్తుంది. ఇక మిగతా పాత్రలన్ని పరిధి మేరకు నటించి మెప్పించారు.
సాంకేతిక వర్గం పనితీరు :
పిసి శ్రీరాం సినిమాటోగ్రఫీ బాగుంది. కాన్సెప్ట్ కు తగినట్టుగా కెమెరా వర్క్ అద్భుతంగా ఉంది. శరత్ మ్యూజిక్ ఇంప్రెస్ చేస్తుంది. మెలోడీ సాంగ్స్ తో ఆకట్టుకునాయి. జయేంద్ర కథ ఓకే అనేలా ఉన్నా కథనం సాగదీతగా ఉంది. ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ లేకుండా కథనం సాగించాడు. కథలో కూడా అంత దమ్ములేదనిపిస్తుంది. ఎడిటింగ్ ఇంకాస్త ట్రిం చేయాల్సి ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.
విశ్లేషణ :
యాడ్ ఫిల్మ్ మేకర్ అయిన జయేంద్ర, సిద్ధార్థ్ తో 180 సినిమా తీశాడు. ఆ సినిమా కాన్సెప్ట్ ఓకే కాని దాన్ని తెరమీద కు తీసుకొచ్చిన విధానం బాగలేదు. అలానే నా నువ్వే విషయంలో కూడా అంతే కథ ఓ మోస్తారుగా కొత్తగా అనిపించినా కథనం నీరసంగా ఉంటుంది. కథనంలో ఆ మ్యాజిక్ వర్క్ అవుట్ కాలేదు.
సినిమాలో కళ్యాణ్ రామ్, తమన్నాల కెమిస్ట్రీ కూడా వర్క్ అవుట్ కాలేదు. సినిమాలో కొన్ని సీన్స్ ఎందుకు రాసుకున్నాడో అన్నట్టుగా ఉంటుంది. మొదటి భాగం కాస్త ఇంట్రెస్టింగ్ గా రాసుకున్నా సెకండ్ హాఫ్ అక్కడక్కడ ల్యాగ్ అయినట్టు అనిపిస్తుంది. మ్యూజిక్ మెలోడీగా ఉండి ఇంప్రెస్ చేసినా సినిమాను కాపాడలేకపోయింది.
కథ దానికి తగినట్టుగా కథనం రాసుకున్న జయేంద్ర దాన్ని తెర మీదకు తీసుకొచ్చిన విధానం ఆకట్టుకోలేదు. నందమూరి ఫ్యాన్స్ ఈ సినిమా నచ్చే అవకాశం ఉంది. కళ్యాణ్ రామ్ ఇదవరకు చూడని సరికొత్త పాత్రలో కనిపిస్తాడు. అంతకుమించి సినిమాలో ఏమి లేదు.
ప్లస్ పాయింట్స్ :
కళ్యాణ్ రామ్
తమన్నా
సినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్ :
కథ
కథనం
స్లో నరేషన్
బాటం లైన్ :
నా నువ్వే.. ఆశించినంతగా లేదు..!
రేటింగ్ : 2.5/5