సినిమాల్లో ఒక హీరో కోసం అనుకున్న పాత్రలో మరొక హీరో నటిస్తూ ఉండడం సర్వసాధారణమైన విషయమే . ఇది మన అందరికీ తెలుసు . అయితే కొన్ని కొన్ని పిక్చర్స్‌లో కొన్ని కొన్ని పాత్రల్లో ఈ హీరోనే బాగుంటారు అంటూ గట్టిగా నొక్కిపెట్టి రాసుకుంటారు డైరెక్టర్లు.. కొన్నిసార్లు ఆ హీరోలు కూడా ఆ పాత్రలను రిజెక్ట్ చేస్తూ ఉండొచ్చు. ప్రజెంట్ దానికి సంబంధించిన ఒక వార్త నెట్టింట బాగా వైరల్ గా మారింది .
టాలీవుడ్ ఇండస్ట్రీలో రౌడీ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న విజయ్ దేవరకొండ తాజాగా నటించిన సినిమా ఫ్యామిలీ స్టార్ . పరశురాంపేట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో హీరోయిన్గా అందాల ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్ నటించింది . ఈ సినిమా కోసం మూవీ టీం ఎలా ప్రమోషన్స్ చేసిందో చూసాం . కచ్చితంగా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది అన్న ధీమా కూడా వ్యక్తం చేశారు .
కొద్ది సేపటి క్రితమే థియేటర్స్ రిలీజ్ అయిన ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ అందుకుంది . గతంలో విజయ్ దేవరకొండ కెరియర్ లో తెరకెక్కిన సినిమాలకు ఈ సినిమాకు పూర్తి భిన్నంగా ఉంది అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు . నిజానికి పరశురాంపేట్ల ఈ కథను టాలీవుడ్ నాచురల్ స్టార్ హీరో నాని కోసం రాసుకున్నారట . మనకు తెలిసిందే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫ్యామిలీ హీరో అనగానే అందరికీ ఇప్పుడు గుర్తొచ్చే పేరు నాని .
అయితే నానినే ఈ కథను రిజెక్ట్ చేశాడట . బ్యాక్ టు బ్యాక్ అన్ని ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమాలలో నటిస్తే జనాలకి బోర్ కొడుతుంది అన్న ఫీలింగ్ తోనే ఈ సినిమాను రిజెక్ట్ చేశాడట . ఈ రీజన్ విన్న అభిమానులు షాక్ అయిపోతున్నారు . ఇంత మంచి సినిమాను సింపుల్ రీజన్ తో రిజెక్ట్ చేసావా..? అంటూ ఫైర్ అవుతున్నారు. మొత్తానికి ఫ్యామిలీ స్టార్ సినిమాను మిస్ చేసుకుని నాని పెద్ద తప్పు చేశాడు అంటున్నారు అభిమానులు..!!