ఈ మధ్యకాలంలో హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ పేరు సోషల్ మీడియాలో తెగ ట్రోలింగ్కి గురైన విషయం అందరికీ తెలిసిందే. మరి ముఖ్యంగా ఆమె బోల్డ్ క్యారెక్టర్స్ చేస్తుంది అని ..రెచ్చిపోయి నటిస్తుంది అని సొంత ఫ్యాన్సే మండిపడుతున్నారు. ఒక అభిమాని అయితే ఏకంగా సెల్ఫీ వీడియోని రిలీజ్ చేస్తూ ..నీకు చేతులెత్తి దండం పెడతా ఇలాంటి బోల్డ్ క్యారెక్టర్స్ చేయొద్దు అంటూ రిక్వెస్ట్ చేశారు .
రీసెంట్గా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటించిన టిల్లు స్క్వేర్ సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయి మంచి పాజిటివ్ టాక్ అందుకుంది . ట్రైలర్ చూసి అందరూ ఆమెది బోల్ట్ క్యారెక్టర్ అనుకున్నారు . కానీ సినిమా చూసిన తర్వాతే ఆమె క్యారెక్టర్ ఏంటి అనేది అర్థమైంది. దీంతో సినిమా రిలీజ్ అయ్యే ముందు వరకు ఆమెను బోల్డ్ క్యారెక్టర్ అంటూ తప్పు పట్టిన జనాలు సినిమా రిలీజ్ అయిన తర్వాత అనుపమ మంచి క్యారెక్టర్ చూస్ చేసుకుంది అని పొగిడేస్తూ వచ్చారు. సినిమా సూపర్ సక్సెస్ అవ్వడంతో ప్రెస్ మీట్ పెట్టింది మూవీ టీం.
ఈ క్రమంలోనే మీడియా ప్రతినిధులు ఇదే విధంగా ప్రశ్నించారు . ఇన్నాళ్లు ఇలాంటి పాత్ర ఎందుకు చేయలేదు ..? అని మీడియా వాళ్ళ ప్రశ్నించగానే అనుపమ పరమేశ్వరన్ కోపంతో ఊగిపోయారు . “నేను ముందుగానే చెప్పాను ..బోల్డ్ క్యారెక్టర్ కాదు నాది పోస్టర్ లు చూసి మోసపోకండి అని.. సినిమా చూసి మాట్లాడండి అని ..ఇప్పుడు అర్థమైందా ..?నేను ఎందుకు చెప్పానో.. ఈ పాత్ర నేను వదలకుంటే కెరియర్ లో ఒక మంచి రోల్ మిస్ చేసుకున్న దాన్ని అవుతాను .. నా పాత్రను యాక్సెప్ట్ చేసి ఆదరిస్తున్నందుకు థాంక్స్ అంటూ అనుపమ పరమేశ్వరన్ రిప్లై ఇచ్చింది “. అంతేకాదు మీడియా ప్రతినిధులు అడిగిన కొన్ని ప్రశ్నలకు ఓపికగా సమాధానం చెప్పింది .అనుపమ పరమేశ్వరణ్ మాట్లాడిన మాటలు ఇప్పుడు నెట్టెంట బాగా వైరల్ గా మారాయి..!!