కోట్లాదిమంది సినీ లవర్స్.. ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్న సినిమా పుష్ప2. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప వన్ ది రైజ్..సినిమాకి ఈ సినిమా సీక్వెల్ గా తెరకేక్కుతుంది. ఈ సినిమా ఆగస్టు 15వ తేదీ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా థియేటర్స్ రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా కోసం కోట్లాదిమంది అభిమానులు కళ్ళల్లో వత్తులు వేసుకొని మరీ వెయిట్ చేస్తున్నారు. పుష్ప2 కోసం అల్లు అర్జున్ ఫాలో అవుతున్న డైట్ వైరల్ గా మారింది.
చాలా సినిమాలకు అల్లు అర్జున్ డైట్ ఫాలో అవుతాడు కానీ.. పుష్ప సినిమాకి మాత్రం కఠినంగా డైట్ ఫాలో అవుతున్నాడు. పుష్పవన్ కి ఫాలో అయిన డైట్ పుష్ప2కి ఫాలో అవుతున్న డైట్ వేరువేరుగా ఉంటుంది . పుష్ప1కి సుకుమార్ అంగీకారంతో అల్లు అర్జున్ మాంసాహారం తిన్నాడు . కానీ పుష్ప 2 దగ్గరకు వచ్చేసరికి అల్లు అర్జున్ పూర్తిగా మాంసాహారం పక్కన పెట్టేసాడు .
ప్రత్యక మైన డైటీషియన్ ని పక్కన పెట్టుకొని సినిమాకి సంబంధించిన ఒక్కొక్క షెడ్యూల్ కి ఒక్కొక్క డైట్ ఫాలో అవుతున్నాడు. కొన్నిసార్లు పూర్తి వెజిటేబుల్స్ తో డైట్ ఫాలో అయితే మరికొన్నిసార్లు ఓన్లీ లిక్విడ్స్ తోనే ఫాలో అవుతున్నారట . అంతేకాదు మార్నింగ్ రాగిజావ లేదా ఓట్స్ మిల్క్ షేక్ ..స్నాక్స్ బౌల్ ఫ్రూట్స్ లేదంటే నట్స్.. లంచ్ కి వచ్చేసరికి రెండు పుల్కా మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ ..
లేదంటే కప్ రైస్ పెరుగు.. ఈవినింగ్ వచ్చేసరికి ఒక కొబ్బరి బొండం .. అదేవిధంగా నైట్ డిన్నర్ వచ్చేసరికి ఓన్లీ సలాడ్ లేదా ..సూప్ తో ఫినిష్ చేస్తున్నాడట . నిజానికి అల్లు అర్జున్ మంచి ఫుడీ కడుపునిండా బిర్యాని తినే టైప్.. మరి అలాంటి బన్నీకి ఇలాంటి కఠిన డైట్ పెడితే ఎలా ..? కానీ పుష్ప2 కోసం అల్లు అర్జున్ ఎంత కఠిన డైట్ అయినా ఫాలో అవుతున్నాడు . ఈ సినిమా కోసం చాలా చాలా కష్టపడుతున్నాడు బన్నీ..!!