ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో వైరల్ గా మారింది . రాధే శ్యామ్ సినిమా డైరెక్టర్ గోపీచంద్ తో సినిమాను తెరకెక్కించబోతున్నాడా..? అంటే అవునన్నా సమాధానమే వినిపిస్తుంది . రాధాకృష్ణ తెరకెక్కించిన సినిమా రాధే శ్యామ్.. పూజా హెగ్డే హీరోయిన్గా నటించిన ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది.
భారీ బడ్జెట్లో తెరకెక్కిన ఈ సినిమా బాగా ఆకట్టుకుంటుంది అంటూ ఎక్స్పెక్ట్ చేశాడు డైరెక్టర్. కానీ అలా జరగలేదు ఈ సినిమా డిజాస్టర్ కా బాప్ అనే రేంజ్ లో ఫ్లాప్ టాక్ దక్కించుకుంది . ఆ తర్వాత సోషల్ మీడియాలో ఈ సినిమా డైరెక్టర్ పై హ్యూజ్ ట్రోలింగ్ కూడా జరిగింది . వాటిని పెద్దగా పట్టించుకోని డైరెక్టర్ రాధాకృష్ణ ఇప్పుడు మరో పాన్ ఇండియా సినిమాతో మన ముందుకు రాబోతున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి .
ఈసారి ప్రభాస్ ఫ్రెండ్ అయినా గోపీచంద్ ని డైరెక్ట్ చేయబోతున్నాడట . ఫుల్ ఫ్లాప్స్ లో ఉన్న గోపీచంద్ కి అసలు హిట్టు లేని రాధాకృష్ణకి ఈ సినిమా ఓ అగ్నిపరీక్ష అంటున్నారు అభిమానులు . ఈ సినిమా హిట్ అయితే హిట్ అయినట్లు.. ఒకవేళ ఫ్లాప్ అయితే గోపీచంద్ కెరియర్ రాధాకృష్ణ కెరియర్ ఇక చిక్కుల్లో పడినట్టే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని కూడా యూవీ క్రియేషన్ సంస్థ నిర్మించబోతున్నట్లు ఓ న్యూస్ వైరల్ గా మారింది . చూద్దాం రాధాకృష్ణ మ్యాజిక్ ఈసారైనా వర్క్ అవుట్ అవుతుందేమో ..? హిట్టు కొడతాడు లేక ఫట్ అంటూ ఇండస్ట్రీకి దూరం అవుతాడో..?