ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేయడం లేదు . ఆర్డర్ చేస్తున్నారు. తమ ఫేవరెట్ హీరో ఎలా ఉండాలి ఎలాంటి దుస్తులు వేసుకోవాలి.. ఎలాంటి వాళ్లతో మాట్లాడాలి ఏం చేయాలి అనేది ఫ్యాన్సే డిసైడ్ చేసేస్తున్నారు. అఫ్కోర్స్ కొంతమంది స్టార్ హీరోలు కూడా ఫ్యాన్స్ కి నచ్చినట్టే ట్రెండ్ సెట్ చేస్తూ ముందుకు వెళ్తున్నారు. వాళ్ళకి ఎటువంటి సినిమాలు నటిస్తే నచ్చుతుందో ..అలాంటి కధలని చూస్ చూసుకుంటున్నారు .
సినిమాలపరంగా అయితే ఓకే కానీ పర్సనల్ లైఫ్ పరంగా కూడా ఫ్యాన్స్ మరీ మరీ ఎక్కువగా ముందుకు వెళ్ళిపోతున్నారు అంటున్నారు కొంతమంది సినీ స్టార్స్ . రీసెంట్ గా సోషల్ మీడియాలో ఒక న్యూస్ బాగా వైరల్ అవుతుంది. సినిమా ఇండస్ట్రీలో తోపులుగా పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్ – బన్నీ – ఎన్టీఆర్లు రాజకీయాల్లో అడుగుపెడితే వారు వన్ సైడ్ అయిపోతుంది అని ..ఖచ్చితంగా రాజకీయాలలో సరికొత్త చరిత్ర సృష్టిస్తారు అని చెప్పుకొస్తున్నారు .
ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు ఆల్రెడీ బిజెపి తరఫున పనిచేసిన వాడే.. ఒకవేళ ప్రభాస్ బిజెపిలో చేరితే పరిస్థితి ఎలా ఉంటుందో మనకు తెలుసు . కానీ ప్రభాస్ కి రాజకీయాలు అంటే ఏం మాత్రము ఇంట్రెస్ట్ లేదు . ఆ విషయాన్ని చాలా సార్లు పరోక్షంగా చెప్పేశాడు . జూనియర్ ఎన్టీఆర్ ఈయన పేరు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . జూనియర్ ఎన్టీఆర్ పాలిటిక్స్ లోకి రావాలి అని చాలామంది అభిమానులు కోరుకుంటున్నారు .
అయితే అది ఎప్పటికి జరుగుతుందో ఆ దేవుడికే తెలియాలి. బన్నీ.. అల్లు అర్జున్ మామగారు కూడా ఓ పొలిటీషియన్ అయితే అల్లు అర్జున్ మాత్రం పాలిటిక్స్ పై ఇంట్రెస్ట్ లేదు . పవన్ కళ్యాణ్ – చిరంజీవి పాలిటిక్స్ వైపు అడుగులు వేసిన బన్నీ మాత్రం ఎప్పుడు పొలిటికల్ గా వేలు పెట్టలేదు . ఈ ముగ్గురు అసలు పొలిటికల్ ఫీల్డ్ అంటేనే పడదు ..మరి ఇలాంటి హీరోస్ ని రాజకీయాల్లోకి రమ్మంటూ ఫ్యాన్స్ డిమాండ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటున్నారు ..? మరికొందరు మాత్రం బై మిస్టేక్ వీళ్ళు మనసు మార్చుకొని ఇండస్ట్రీలో రాజకీయాల్లోకి వస్తే ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ స్థానాన్ని అందుకున్నట్లే రాజకీయాల్లో కూడా చక్రం తిప్పేస్తారని ..అప్పుడు మిగతా వాళ్ళకి ఉ** పడిపోవాల్సిందేనంటున్నారు..!!