విక్రమార్కుడు.. మాస్ మహారాజ రవితేజ కెరీర్ లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమా. టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకధీరుడుగా పాపులారిటీ సంపాదించుకున్న రాజమౌళి ఎంతో ఇష్టంగా తెరకెక్కించిన సినిమా కూడా ఇదే . ఆయన కెరియర్లో ఎన్నో సినిమాలు ఉన్నా కూడా విక్రమార్కుడు సినిమా అంటేనే రాజమౌళికి చాలా చాలా ఇష్టం . దానికి రీజన్స్ కూడా ఆయన చాలా సార్లు చెప్పుకొచ్చాడు.
2006లో వచ్చిన ఈ సినిమా ఎంత సూపర్ డూపర్ హిట్ అయిందో మనకు తెలిసిందే . ఈ సినిమా రిలీజ్ అయ్యి దాదాపు 18 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సినిమాకి సీక్వెల్ రావాలి అంటూ ఎప్పటినుంచో ఫ్యాన్స్ కోరుకుంటున్నారు . ఆ కోరిక ఇప్పుడు నెరవేరబోతున్నట్లు తెలుస్తుంది . ఈ చిత్రం నిర్మాత కేకే రాధా మోహన్ ఇటీవల ఓ ప్రమోషన్స్ లో పాల్గొనడం అక్కడ ఆయనకు విక్రమార్కుడు మూవీ గురించి ప్రశ్నలు ఎదురవ్వడం.. ఆయన విక్రమార్కుడు 2 పై క్రేజీ అప్డేట్ ఇవ్వడం అభిమానులకి గూస్ బంప్స్ తెప్పిస్తుంది .
విక్రమార్కుడు 2 కధ రెడీ గానే ఉంది. కానీ రవితేజ ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని చెప్పారు. ఆయనను ఒప్పించే ప్రయత్నంలో ఉన్నాము అంటూ కూడా చెప్పారు. అయితే తాజాగా ఉన్న సమాచారం ప్రకారం ఈ సినిమా డైరెక్టర్ కూడా మారిపోతున్నాడట. ప్రజెంట్ రాజమౌళి స్థానం ఎలా ఉందో మనకు తెలిసిందే. బిజీ బిజీ ..అందుకే విక్రమార్కుడు 2 కి ఆయన డైరెక్షన్ వహిస్తారో లేదో అన్న సస్పెన్స్ అందరిలోనూ ఉంది. అందుకే రాజమౌళి కాకుండా ఈ సినిమాకి సంపత్ నంది డైరెక్షన్ వహించబోతున్నాడు అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది . అంతేకాదు ఒకవేళ రవితేజ ఈ సినిమాను నటించను అని చెప్తే మాత్రం కచ్చితంగా హీరో నానిను ఆ ప్లేస్ లోకి తీసుకొచ్చే ఛాన్సెస్ ఉన్నాయట. హీరోయిన్ గా మృణాల్ ఠాకూర్ నటించబోతుందట.