టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న విశ్వక్ సేన్.. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటించిన సినిమా గామి . ఈ సినిమా నేడు మహాశివరాత్రి సందర్భంగా థియేటర్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అందుకుంది. మరి ముఖ్యంగా ఈ సినిమాలో విశ్వక్ సేన్.. పెర్ఫార్మెన్స్ కెవ్వు కేక అనే రేంజ్ లో ఉంది అంటున్నారు అభిమానులు . ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు.
అంతేకాదు ఇప్పటివరకు మనం ఎప్పుడూ చూడని డిఫరెంట్ గెటప్ లో ఈ సినిమాలో విశ్వక్ సేన్ ని చూసాం. అఘోరా టైప్ లో ఉండే పాత్రలో విశ్వక్ సేన్ ఇరగదీసేశాడు . పక్కాగా చెప్పాలంటే ఈ పాత్రకి విశ్వక్ సేన్ తప్పిస్తే మరి ఎవరు కూడా సెట్ అవ్వరు అనే రేంజ్ లో అల్లాడించేశారు. విద్యాధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో చాందిని చౌదరి హీరోయిన్గా నటించింది . ఈ మూవీని వి సెల్లులోయిడ్ సమర్పణలో కార్తీక కల్ట్ క్రియేషన్ పతాకంపై కార్తీక్ శబరిష్ ఎంతో ఇష్టంగా నిర్మించారు .
ఈ సినిమాకి అన్నిటికన్నా హైలెట్ పాయింట్ కధ. ఇప్పటివరకు మనం చూడని ఓ సరికొత్త కథతో మన ముందుకు వచ్చాడు డైరెక్టర్. ఓ వింత తెలియని సమస్యతో బాధపడుతూ ఉంటాడు శంకర్ అదే మన విశ్వక్సేన్ ..అతన్ని ఏ మనిషి టచ్ చేసిన సరే బాడీలో ఆటోమేటిక్గా మార్పులు వస్తుంటాయి.. దీంతో ఆశ్రమం నుంచి అతని వెళ్ళగొట్టేస్తారు . అయితే తనను చేరదీసిన గురువు వద్దకు వెళ్లాలని కాశీకి వెళ్లిపోతాడు. శంకర్ గురువు అప్పటికే చనిపోతాడు. ఈ క్రమంలోని శిష్యుడు ద్వారా తనకు ఉన్న సమస్య తెలుసుకుంటాడు.
దానికి పరిష్కారం హిమాలయాల్లోని త్రివేణి పర్వతంలో 36 ఏళ్లకు ప్రకాశించే మాలిపత్రి చెట్టులో ఉంటుందని చెబుతాడు . వైద్రతిధి రోజున మాత్రమే అది పలకరిస్తుంది అని ..ఆ సమయంలో అది తీసుకుంటే అన్ని జబ్బులకు పరిష్కారం దొరుకుతుందని చెప్తాడు.. అసలు అతని ఇచ్చిన మ్యాప్తో శంకర్ ఏం చేశాడు..? జాహ్నవి తన మెడికల్ ప్రయోగం కోసం శంకర్ ని ఎలా వాడుకుంటుంది..? వీరి ప్రయాణం హిమాలయాల్లో ఎలా కొనసాగుతుంది..? ఫైనల్లీ ఏం జరిగింది..? అనేది కథ ..టోటల్గా డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చాడు విశ్వక్సేన్ . ఈ సినిమా అభిమానులను కచ్చితంగా ఆకట్టుకుంటుంది . అంతేకాదు ఈ సినిమా ఖచ్చితంగా నేషనల్ అవార్డ్ ని అందుకుంటుంది అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు అభిమానులు . చూద్దాం మరి ఫస్ట్ డే కలెక్షన్స్ ఏ విధంగా ఉంటాయో..?