జూనియర్ ఎన్టీఆర్ .. ఈ పేరు చెప్తే ఫ్యాన్స్ ఏ రేంజ్ లో ఊగిపోతారో మనకు తెలిసిందే. పూనకాలు కాదు డబల్ డోస్ పూనకాలు రావడం పక్క. జూనియర్ ఎన్టీఆర్ పేరు వింటేనే ఓ రేంజ్ లో అరుపులు కేకలతో రచ్చ రంబోలా చేసేస్తూ ఉంటారు నందమూరి అభిమానులు . కాగా రీసెంట్గా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు గూస్ బంప్స్ తెప్పించే న్యూస్ ఒకటి నెట్టింట వైరల్ గా మారింది .
ఎన్టీఆర్ మంచోడు చాలా చాలా మంచోడు.. నమ్మకానికి నిజాయితీకి మరో మారుపేరు.. ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతాడు .. అందరికీ ఇవే తెలుసు.. డాన్స్ బాగా చేస్తారు.. డైలాగ్స్ బాగా చెప్తాడు ..ఇది కూడా తెలుసు . అయితే ఎన్టీఆర్ కొరియోగ్రఫీ కూడా చేస్తాడు అన్న విషయం చాలా తక్కువ మందికే తెలుసు .. ఆయన కెరియర్ లో నటించిన ఓ సినిమాలో ఆయన పాటకు ఆయన కొరియోగ్రఫీ చేసుకున్నారట.
ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది . రభస సినిమాలో ఎన్టీఆర్ తన పాటకు ఆయనే కొరియోగ్రఫీ చేసుకున్నారట . సినిమా ఫ్లాప్ అయినా సరే ఈ పాట మాత్రం సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది . ఎన్టీఆర్ కి ఇప్పటికీ ఆ పాట చూస్తే తన పాత రోజులు గుర్తుకు వస్తాయట . ప్రజెంట్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే సినిమాలో నటిస్తున్నాడు . ఈ సినిమా అయిపోగానే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక సినిమాకి కమిట్ అయ్యాడు. మధ్యలో బాలీవుడ్ లో సినిమా కూడా చేస్తున్నాడు..!!