ఈ మధ్యకాలంలో గుంటూరు కారం సినిమాపై ఎలాంటి ట్రోలింగ్ జరిగిందో మనం చూసాం. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు దర్శకత్వంలో తెరకెక్కిన గుంటూరు కారం సినిమాలో మహేష్ బాబు హీరోగా నటించాడు . అందాల ముద్దుగుమ్మ శ్రీ లీల హీరోయిన్ గా నటించింది . మరో హాట్ బ్యూటీ మీనాక్షి చౌదరి ఈ సినిమాలో ఇంకో హీరోయిన్గా నటించింది . సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ టాక్ అందుకుంది . కలెక్షన్స్ పరంగా హిట్ .. టాక్ పరంగా ఫట్ అంటూ అందరూ చెప్పుకున్నారు.
మహేష్ అభిమానులకు సైతం ఈ సినిమా నచ్చలేదు . అనుకున్న రేంజ్ లో కలెక్షన్స్ కూడా రాబట్ట లేక పోయింది . ఏదో హిట్ అయిందంటే హిట్ అయింది అన్న రేంజ్ లో ఉండింది . ఈ సినిమాకి కాంపిటీషన్ గా వచ్చిన హనుమాన్ మాత్రం ఇప్పటికీ థియేటర్స్ లో సక్సెస్ఫుల్గా దూసుకుపోతుంది. రీసెంట్గా ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ గుంటూరు కారం సినిమాపై చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి .
యూట్యూబ్ వేదికగా ఆయన మాట్లాడుతూ..” 350 సినిమాలకు పైగా పనిచేసిన నాకు గుంటూరు కారం స్టోరీ కాస్త వింతగా అనిపించింది.. ప్రేక్షకులు ఎలా అర్థం చేసుకున్నారో కూడా నాకు అర్థం కావడం లేదు ..రెండోసారి చూస్తే ఏమన్నా అర్థమవుతుందేమో అని అనుకుంటున్నాను. గుంటూరు కారం ఎంత ఘాటు ఉంటుందో ఇందులో హీరోను అలాగే చూపించాడు త్రివిక్రమ్ . అయితే సినిమాల విషయంలో టైటిల్స్ మిస్టేక్ పెడుతూ ఉంటారు కొందరు. కానీ ఈ మూవీ టైటిల్ ఎందుకో నాకు కొంచెం తేడాగా అనిపించింది. తల్లి సెంటిమెంట్ అంతగా పండలేదు ..అనిపించింది .. సెంటిమెంట్ ప్రధానంగా సినిమాలు తీద్దాం అనుకుంటే ఈ టైటిలే తప్పు “గుంటూరు వారి అబ్బాయి”.. ఆ టైటిల్ పెట్టి ఉంటే కుటుంబ కథ చిత్రం గా ఉండొచ్చు “అంటూ తన మనసులోని విషయాలను బయటపెట్టాడు . ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ గా మారింది..!!