సినిమా ఇండస్ట్రీలో కొన్ని కొన్ని సినిమాలను మనం మర్చిపోవాలి అనుకున్న కూడా మర్చిపోలేము . అలాంటి చెరగని స్థానాన్ని మన మనసుల్లో సంపాదించుకుంటాయి. ఆఫ్ కోర్స్ అలాంటి సినిమాలను మనం మర్చిపోవాలన్నా కూడా మర్చిపోలేము పదేపదే గుర్తు చేసుకుంటూ ఉంటాం. అలాంటి సినిమాల్లో ఒకటే విక్రమార్కుడు . ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా సాదాసీదాగా రిలీజ్ అయి సినిమా ఇండస్ట్రీని షేక్ చేసి ఇండస్ట్రీ రికార్డును బద్దలు కొట్టే రేంజ్ లో కలెక్షన్స్ సాధించిన ఈ మూవీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే .
రాజమౌళి కెరియర్ని టర్న్ చేసింది ..మాస్ మహారాజ రవితేజ జీవితాన్ని బాగుపరిచింది. ఒకటా రెండా చెప్పుకుంటూ పోతూ ఉంటే ఎన్నెన్నో అప్పటివరకు కేవలం రొమాన్స్ – తొడగొట్టడాలు- నరకడాలు ఇలాంటివే చూసాం . ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ తలుచుకుంటే ఏదైనా చేయగలడు అని ప్రూవ్ చేశాడు తన సినిమా ద్వారా రాజమౌళి . ఈ సినిమా పర్సనల్గా అందరికీ బాగా కనెక్ట్ అయింది . ఆడవాళ్లకు ..యంగ్ స్టార్స్ కు ..పోలీసులకు.. కుటుంబం బాధ్యతలు మోసే పెద్దదిక్కుకు ..చిన్నపిల్లలకు అందరికీ బాగా కనెక్ట్ అయింది . అయితే మొదటిగా ఈ సినిమాలో హీరోగా బాలకృష్ణ – పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోలను అనుకున్నాడట రాజమౌళి .
వాళ్ళు కథ విని రిజెక్ట్ చేశారట . దీంతో ఫైనల్లీ కథ రవితేజకు రవితేజ వద్దకు వెళ్ళింది . అయితే రవితేజ ఈ సినిమాకు ఓకే చెప్పిన తర్వాత రాజమౌళి ఆయనకు ఒక క్రేజీ కండిషన్ పెట్టారట . “నేను ఎటువంటి డైలాగులు అయితే రాశానో.. ఆ డైలాగులను తూచా తప్పకుండా అదే విధంగా చెప్పాలి . ఎక్కడ కూడా పొల్లు పోకూడదు .. నా క్యారెక్టర్ కి అహంకి అడ్డొస్తాయి అని అనకూడదు ..నేను ఈ సినిమాని చాలా కష్టపడి రాసుకున్నాను” అంటూ చెప్పుకొచ్చాడట . దానికి రవితేజ కూడా ఓకే చెప్పాడట. అన్న మాట ప్రకారమే రవితేజ డైలాగులను చాలా ఘాటుగా చెప్పాడు . అంతేకాదు రాజమౌళి ఈ సినిమా ద్వారా మంచి క్రేజ్ ను తన ఖాతాలో వేసుకున్నాడు . ఇప్పటికీ ఈ సినిమా టీవీలో వస్తే మనం కన్ను ఆర్పకుండా చూస్తాం అంత బాగుంటుంది ఈ సినిమా..!!