కొన్నిసార్లు మన క్రేజ్ మన కొంప ముంచుతుంది అంటే ఇదేమో అంటూ ఫ్యాన్స్ వెటకారంగా రష్మిక మందన్నాను ట్రోల్ చేస్తున్నారు . నేషనల్ క్రష్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న రష్మిక మందన్నా రీసెంట్గా యానిమల్ సినిమాలో నటించింది అప్పటివరకు చాలా డీసెంట్ పాత్రలు చేసిన రష్మిక ఒక్కసారిగా బోల్డ్ రోల్ లో కనిపించేసరికి జనాలు షాక్ అయిపోయారు . సొంత ఫ్యాన్స్ కూడా మండిపడ్డారు కొన్ని తిట్లతో.. కొన్ని బూతులతో కొన్ని పాజిటివ్ కామెంట్స్ తో రష్మిక యానిమల్ సినిమా సక్సెస్ఫుల్గా 900 కోట్లు కలెక్షన్స్ అందుకునింది . ఇప్పుడు రష్మిక కాన్సన్ట్రేషన్ తన నెక్స్ట్ సినిమాలపై పడింది .
అంతకుముందు పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో పాపులారిటీ సంపాదించుకున్న రష్మిక ఇప్పుడు పుష్ప2 సినిమాతో గ్లోబల్ వైడ్ గుర్తింపు సంపాదించుకోవడం పక్క అంటూ ఫిక్స్ అయిపోయింది . పుష్ప2 సినిమా షూట్స్ లో బిజీగా ఉంది. దీనికి సంబంధించి కొన్ని పోస్టులు కూడా వైరల్ అవుతున్నాయి . అయితే రష్మిక తెలుగులో రెండు సినిమాలు చేస్తుంది. పుష్ప 2 కాకుండా రెయిన్బో – ది గర్ల్ ఫ్రెండ్ లేడీ ఓరియంటెడ్ ఫీలింలు చేస్తుంది . అయితే రెయిన్బో సినిమాలో మొదటిగా హీరోయిన్గా సమంతని అనుకున్నారట. కానీ కొన్ని కారణాల చేత ఆమె తప్పుకోవడంతో ఈ ప్లేస్ లోకి వచ్చింది రష్మిక .
అయితే రష్మిక ఈ సినిమాకి కమిట్ అయినప్పుడు చాలా తక్కువ రెమ్యూనరేషన్ ఛార్జ్ చేసిందట . అగ్రిమెంట్ పై కూడా అలాగే రాస్కొచ్చిందట . ఎప్పుడైతే ఆనిమల్ సినిమా హిట్ అయిందో పుష్ప2కి క్రేజ్ పెరిగిందో రష్మిక రెమ్యూనరేషన్ హై రేంజ్ లో డిమాండ్ చేసిందట . అనుకున్న రెమ్యూనరేషన్ కి డబుల్ ఇవ్వాలి అంటూ పట్టు పట్టిందట. దీంతో మేకర్స్ కి ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. దీంతో ఏం చేయాలో తెలియక మేకర్స్ సినిమాని పోస్ట్ పోన్ చేశారట . రష్మిక తో తెరకెక్కించాల్సిన షాట్స్ చాలా ఉన్నాయట.
ఈ మూమెంట్లో ఇలా రష్మిక రెమ్యూనరేషన్ పెంచేస్తే ఎలా అంటున్నారు ..? ఈ మధ్యకాలంలో రష్మిక రెమ్యూనరేషన్ పెంచేసింది అన్న వార్తలు కూడా వైరల్ అయ్యాయి . దానికి రష్మిక కౌంటర్ కూడా వేసింది . అయితే ఈ వార్తలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ.. బాగా ట్రెండ్ అవుతుంది. దీంతో రష్మిక హేటర్స్ కు మంచి కీ పాయింట్ దక్కింది . తన ఓవర్ క్రేజే తనకు శత్రువులా మారింది అని రెమ్యూనరేషన్ పేరుతో తన పరువు తానే తీసుకుంటుంది అని అందుకే సినిమా ఆగిపోయింది అని.. ఇలా రెండు మూడు సినిమాలు ఆగిపోతే ఇక నీ బతుకు బస్టాండ్ అంటూ ట్రోల్ చేస్తున్నారు జనాలు..!!