సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా రావాలి అని .. వెండితెరపై తమ బొమ్మను చూసుకోవాలి అని ..పది కాలాలపాటు ఇండస్ట్రీలో చల్లగా ఉండాలి అని .. ప్రతి ఒక్క హీరోయిన్ కోరుకుంటుంది కానీ అలా కోరుకున్న ప్రతి హీరోయిన్ కూడా ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ స్థానాన్ని అందుకోలేదు. కొన్నిసార్లు తమ పర్ఫామెన్స్ బాగున్నప్పటికీ తీసుకున్న డెసిషన్స్ కారణంగా బోల్తా పడుతూ ఉండొచ్చు. ఆ లిస్టులోకే వస్తుంది తెలుగు బ్యూటీ అర్చన . ఈమె గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.
చాలా చక్కగా ఉంటుంది .. హీరోయిన్ కి మించిపోయే మెటీరియల్ ఉన్న బ్యూటీ అనే చెప్పాలి . చక్కగా డాన్స్ చేస్తుంది . తెలుగు అవలీలగా మాట్లాడగలదు . ఎటువంటి ఎక్స్ప్రెషన్స్ అయినా ఇస్తుంది .. కానీ అమ్మడు అదృష్టమో దురదృష్టమో ఆమెకు వచ్చిన అవకాశాలన్నీ సపోర్టింగ్ క్యారెక్టర్స్ . ఇండస్ట్రీలోకి హీరోయిన్ అవుదామని వచ్చిన అర్చనకు “నువ్వొస్తానంటే నేనొద్దంటానా” సినిమాలో ఫ్రెండ్ పాత్రలో కనిపించే ఛాన్స్ వచ్చింది . పెద్ద హీరోయిన్ త్రిష హీరో సిద్ధార్ధ్..సినిమా కావడంతో అందరూ ఈ సినిమాపై ఓ రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేశారు .
ఆఫ్ కోర్స్ సినిమాలో ఆమె పాత్రకి కూడా మంచి ప్రశంసలు దక్కాయి . కానీ ఆ తర్వాత అందరూ కూడా మేకర్స్ ఆమెకు సపోర్టింగ్ రోల్స్ ఇవ్వడం మొదలుపెట్టారు . మలయాళం – కన్నడ – తెలుగు భాషలలో ఎన్నో సినిమాల్లో నటించింది . అన్ని కూడా సపోర్టింగ్ రోల్సే దక్కాయి . హీరోయిన్గా చేసిన అరాకొరా సినిమాలు ఫ్లాప్ అయ్యాయి . ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అర్చన పరోక్షకంగా తన కెరియర్ డౌన్ అవ్వడానికి కారణం నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాలోని పాత్ర అంటూ చెప్పుకొచ్చింది. ఈ మూవీలో త్రిష ఉండడం వల్ల ఆమె క్యారెక్టర్ సపోర్టింగ్ రోల్ అయిందని .. ఇక ఆ సినిమాలో తన పాత్ర చూసిన మేకర్స్ అందరూ కూడా సపోర్టింగ్ రోల్స్ ఇవ్వడానికి ఇంట్రెస్ట్ చూపించారు అని .. అలా తన కెరియర్ పాడైపోయింది అని చెప్పుకు వచ్చింది అర్చన..!!