ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో ఉండే హీరోయిన్స్ చాలా తెలివిగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. గతంలో హీరోయిన్స్ క్రేజ్ పాపులారిటీ ఉన్న హీరో సినిమాలను మాత్రమే చూస్తూనే వాళ్ళు .. తద్వారా రెమ్యూనరేషన్ వస్తుంది వాళ్లకు పాపులారిటీ దక్కుతుంది అనే భ్రమలో ఉండేవాళ్లు . అయితే ఇప్పుడు హీరోయిన్స్ మాత్రం హీరోలతో కాదు ..ఇంపార్టెంట్ సినిమాలో ..హీరోయిన్స్ ఇంపార్టెంట్ అన్న రేంజ్ లో కధలని చూస్ చేసుకుంటున్నారు . మరీ ముఖ్యంగా బాలీవుడ్ బ్యూటీస్ అయితే ఎంత పెద్ద స్టార్ హీరోలనైనా సరే రిజెక్ట్ చేసి పడేస్తున్నారు.
తాజాగా అదే లిస్టులోకి యాడ్ అయిపోయింది అందాల ముద్దుగుమ్మ అలియాభట్ . అలియా భట్ .. బాలీవుడ్ ఇండస్ట్రీలోనే వన్ ఆఫ్ ద స్టార్ బ్యూటీ.. పెళ్లి చేసుకొని ఒక పాపకు జన్మనిచ్చిన.. సరే పర్ఫెక్ట్ ఫిగర్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తుంది. కాగా అలియా భట్ కి సంబంధించిన ఒక వార్త నెట్టింట బాగా ట్రెండ్ అవుతుంది. అలియాభట్ దేవర సినిమాలో ఎన్టీఆర్ సరసన నటించాల్సి ఉండింది . అప్పట్లో అనాఫిషియల్ గా కన్ఫామ్ కూడా చేసేసింది .
కానీ ఆ తర్వాత పెళ్లి – ప్రెగ్నెన్సీ కారణంగా ఈ ప్రాజెక్టుకు దూరమైంది . అయితే మరోసారి ఎన్టీఆర్ తో నటించే ఛాన్స్ అందుకున్నట్లు తెలుస్తుంది ఈ బ్యూటీ. వార్ 2 సినిమాలో ఎన్టీఆర్ కి జోడిగా అలియా భట్ నటించబోతుంది అన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ప్రచారం జరుగుతుంది. బాలీవుడ్ ఇండస్ట్రీలో సెన్సేషనల్ హీరోయిన్గా పాపులారిటీ దక్కించుకున్న ఈ బ్యూటీ దేవర సినిమాను రిజెక్ట్ చేయడం అదేవిధంగా వార్ 2 సినిమాను ఓకే చేయడం ఇప్పుడు అభిమానులకి కొత్త డౌట్లు పుట్టిస్తుంది . అప్పట్లో రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ సినిమా విషయంలో ఆమె పట్ల చిట్ చేశాడని .. ఆమె క్యారెక్టర్ తక్కువుగా రాశాడని ఆ కారణంగానే తెలుగు సినిమాలకు కమిట్ అవ్వట్లేదు అన్న ప్రచారం కూడా జరిగింది..!!