Moviesఅమ్మాయి ప్రేమ ముసుగులో అడ్డంగా బలైపోయిన కింగ్ లాంటి తెలుగు హీరో.....

అమ్మాయి ప్రేమ ముసుగులో అడ్డంగా బలైపోయిన కింగ్ లాంటి తెలుగు హీరో.. ఫ్యాన్స్ కు కన్నీళ్లు..!

ప్రేమ అన్ని సార్లు సక్సెస్ అవ్వదు. కొన్నిసార్లు ప్లాప్ అవుతూ ఉంటుంది. కొన్నిసార్లు హిట్ అవుతూ ఉంటుంది . అయితే చాలామంది విషయాలలో ప్రేమ అటు ఇటు కాకుండా మిగిలిపోతూ ఉంటుంది. కాగా ఇండస్ట్రీలో ఎంత పెద్ద హీరో అయినా సరే కొన్ని కొన్ని సార్లు తాను ఊహించినవి జరుగుతూ ఉంటాయి. అదే విషయాన్ని మరోసారి ప్రూవ్ చేశాడు ఆనంద్ దేవరకొండ. టాలీవుడ్ ఇండస్ట్రీలో రౌడీ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న విజయ్ దేవరకొండ తమ్ముడే ఈ ఆనంద్ దేవరకొండ .

చేసింది కొన్ని సినిమాలే ..హిట్ అయింది కూడా ఒకటో రెండో . అయితే రీసెంట్గా వచ్చిన బేబీ సినిమా మాత్రం ఆయన కెరీర్ కు మంచి బూస్టప్ ఇచ్చింది. బేబీ సినిమాలో హీరోయిన్ ను గాఢంగా ప్రేమిస్తాడు ఆనంద్ దేవరకొండ . ఆ తర్వాత బ్రేకప్ చెప్పుకుంటారు. ఆ నరకం భరించలేడు . అయితే ఇది కేవలం సినిమా స్టోరీనే అనుకుంటే పొరపాటు . అది నిజ జీవితంలో కూడా అలాగే జరిగింది . ఇదే విషయాన్ని ఓపెన్ గా ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టాడు ఆనంద్ దేవరకొండ .

తాను ఫస్ట్ ఒక అమ్మాయిని ప్రేమించాను అని .. తాను కూడా నన్ను ప్రేమించింది అంటూ నమ్మించింది అని .. ఉన్నత చదువుల కోసం ఆమె చికాగో వెళ్ళింది అని .. నేను కూడా ఆమెతో జాలీగా గడపడానికి అమెరికా వెళ్లడానికి ప్లాన్ చేసుకున్నాను అని .. చికాగో చుట్టుపక్కలే ఒక యూనివర్సిటీలో సీటు దక్కించుకున్నాను అని .. చికాగో వెళ్లిపోయాక ఒక విషయం బయటపడింది అని .. నేను ఊహించుకున్నది ఒకటి అక్కడ జరిగింది ఒకటి .. ఆమె తనను నమ్మించి మోసం చేసింది అని ..యవ్వారం బెడిసి కొట్టింది అని ..అప్పుడే లవ్ అన్న పేరు పై విరక్తి వచ్చింది అని చెప్పుకొచ్చాడు .

అంతేకాదు ఆమె చేసిన మోసం భరించలేక నాలుగేళ్ల పాటు డిప్రెషన్ కి గురయ్యాను అని కూడా చెప్పుకొచ్చాడు . అంత పెద్ద స్టార్ హీరో తమ్ముడు ఒక అమ్మాయి చేతిలో ఇలా బకరాగా మారడం ఏంటి..? అంటూ జనాలు నవ్వుకుంటున్నారు . మరి కొంతమంది ఇదే అన్ని ప్రేమ వ్యవహారాలలో ఉండే మ్యాటరే ..ఫిల్ అవ్వకు బ్రో ..మూవ్ ఆన్ అంటూ సజెస్ట్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news