టాలీవుడ్ ఇండస్ట్రీలో ఐకాన్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న అల్లు అర్జున్ ప్రెసెంట్ పుష్ప2 సినిమా షూట్స్ లో బిజీగా ఉన్నాడు . ఈ సినిమాతో గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకోవడం పక్కా అంటూ జనాల సైతం ధీమా వ్యక్తం చేస్తున్నారు . కాగా పుష్ప సినిమా తర్వాత అల్లు అర్జున్ నెక్స్ట్ డైరెక్టర్ ల లిస్ట్ పెద్దగానే ఉంది . త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు – లోకేష్ కనగరాజు – అట్లీ – రాజమౌళి – ప్రశాంత్ నీల్ లాంటి స్టార్ డైరెక్టర్లు క్యూలో ఉన్నారు .
కాగా రీసెంట్గా బన్నీ భార్యకు సంబంధించిన ఒక న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది . సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్ గా ఉండే బన్నీ భార్య మంచి సింగర్ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . బన్నీ భార్య బయట ఎప్పుడూ కూడా మాట్లాడినట్లు మనం చూడలేదు . సైలెంట్ గా తన పని తాను చేసుకుని వెళ్ళిపోతుంది. రకరకాల డ్రెస్లు వేసుకుంటుందే తప్పిస్తే..ఎక్కడ కూడా డ్యాన్స్ చేసిన్నట్లు కూడా కనిపించదు.
అయితే బన్నీ భార్య లో మంచి సింగర్ దాగుందట. ఆమె వాయిస్ చాలా హస్కిగా ఉంటుందట . కొన్ని కొన్ని రొమాంటిక్ పాటలు పాడితే చాలా అద్భుతంగా ఉంటాయట . ఏదైనా ఫ్యామిలీ ఫంక్షన్స్ లో పాడుతుందే తప్పిస్తే బయట పెద్దగా పాడదట. ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ అవుతుంది. ప్లీజ్ బన్నీ అన్న ఒక్కసారి మా వదిన పాట వినిపించు అంటూ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కామెంత్స్ చేస్తున్నారు..!!