Moviesఛీ ఛీ.. ప్రభాస్ పై ఇలాంటి చెత్త రూమరా..? ఏ రా...

ఛీ ఛీ.. ప్రభాస్ పై ఇలాంటి చెత్త రూమరా..? ఏ రా కడుపుకి అన్నమే తింటున్నారా..?

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఫేక్ వార్తలు గాసిప్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఎవరైనా స్టార్ సెలబ్రిటీలు తమపై ఫేక్ వార్తలు వస్తున్న పట్టించుకోవడం లేదు అంటే అలాంటి వాళ్లపై ఇంకా ఇంకా ఫేక్ వార్తలు రావడం ఎక్కువగా చూస్తున్నాం . రీసెంట్గా సోషల్ మీడియాలో అలా బాగా ట్రోలింగ్ కి గురవుతున్న వ్యక్తి ప్రభాస్. టాలీవుడ్ ఇండస్ట్రీలో రెబల్ స్టార్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ప్రభాస్ ఇండస్ట్రీలో ఎన్ని మంచి సినిమాలో నటించాడొ మనకు తెలిసిందే.

ప్రభాస్ కెరియర్ని మలుపు తిప్పిన సినిమాలు చాలానే ఉన్నాయి. అయితే కెరియర్ పరంగా దూసుకుపోతున్న ప్రభాస్ వ్యక్తిగత విషయం కారణంగా సోషల్ మీడియాలో ఎప్పుడు ట్రెండ్ అవుతూనే ఉంటాడు . అదే ఆయన పెళ్లి ఆయన పెళ్లి . ఎప్పుడు చేసుకుంటాడా..? అంటూ జనాలు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు . అయితే నిన్న మొదటి వరకు అనుష్కతో పెళ్లి అంటూ తెగ ప్రచారం చేసిన జనాలు ఇప్పుడు ఆ స్థానంలోకి మరొక హీరోయిన్ ని తీసుకొచ్చారు .

బాలీవుడ్ హాట్ బ్యూటీ కృతి సనన్ తో మాల్దీస్ లో ఎంగేజ్మెంట్ జరగబోతుంది అంటూ సరికొత్త ప్రచారానికి తెరలేపారు. దీనిపై ప్రభాస్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు . ఎన్నిసార్లు ప్రభాస్ కి పెళ్లి చేస్తారా..? ఎంతమందితో చేస్తారు..? వాళ్ళ మధ్య అది లేదు అంటూ వాళ్లే ఓపెన్ గా చెప్పారు.. ఇంకెన్నిసార్లు మీరు ఇలా గాసిప్స్ క్రియేట్ చేస్తారు..? అంటూ ఫైర్ అయిపోతున్నారు . మరికొందరు మా ప్రభాస్ పై ఇంత చెత్త రూమరా..? కడుపుకి అన్నం తింటున్నారా..? అంటూ ఘాటుగా బధులీస్తున్నారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news