సూపర్ స్టార్ రజినికాంత్ హీరోగా పా. రంజిత్ డైరక్షన్ లో వస్తున్న సినిమా కాలా. తెలుగు తమిళ భాషల్లో భారీగా రిలీజ్ అవుతున్న ఈ సినిమా జూన్ 7న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఇక ఈ సినిమా బిజినెస్ విషయంలో బయ్యర్లు కాస్త కంగారు పడుతున్నారు. ఎందుకంటే రజినికాంత్ సినిమా హిట్ అయితే ఆ లెక్క వేరేలా ఉంటుంది కాని ఫ్లాప్ అయితేనే కష్టం.
ఒకప్పుడు స్టార్ సినిమా ఎలా ఉన్నా ఆడేస్తుంది కాని ఇప్పుడు పరిస్థితి వేరు సినిమా బాగాలేదంటే కనీసం థియేటర్ వైపు చూసేందుకు కూడా ఇష్టపడట్లేదు. ఈ క్రమంలో రజిని సినిమాకు కొత్త కష్టాలు మొదలవుతున్నాయి. ఇప్పటికే రజిని ఇదవరకు సినిమాల విషయంలో డిస్ట్రిబ్యూటర్స్ గొడవ తెలిసిందే. బాబా నుండి కబాలి వరకు ఫ్లాప్ అయిన సినిమాకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.
ఇక ఇప్పుడు కబాలి కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా బిజినెస్ విషయంలో కూడా ఆచి తూచి అడుగులేస్తున్నారట. సినిమా హిట్ అయితే లెక్కకు మించి వసూళ్లు వస్తాయి కాని ఫ్లాప్ అయితేనే కష్టం. మరి కాలా రికార్డులను క్రియేట్ చేస్తుందా లేక మళ్లీ రజినిని రిస్క్ లో పడేస్తుందా అన్నది చూడాలి.