Moviesబిగ్ బ్రేకింగ్: పట్టు చీరలో ఫ్యూజులు ఎగిరిపోయేలా చేసిన బన్నీ.. పుష్ప2...

బిగ్ బ్రేకింగ్: పట్టు చీరలో ఫ్యూజులు ఎగిరిపోయేలా చేసిన బన్నీ.. పుష్ప2 నుంచి రోమాలు నిక్కబొడ్చుకునే క్రేజీ ఫోటో లీక్..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న అల్లు అర్జున్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న సినిమా పుష్ప2. పుష్ప వన్ సినిమాకి సీక్వెల్ గా ఈ మూవీ తెరకెక్కబోతుంది . ప్రజెంట్ ఈ సినిమా సెట్స్ పై ఉంది . ఈ సినిమాను మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ తనదైన స్టైల్ లో డైరెక్టర్ చేయబోతున్నాడు . ఈ సినిమా కోసం వేల కోట్లాదిమంది జనాలు వెయ్యి కళ్ళతో వెయిట్ చేస్తున్నారు .

పుష్ప పార్ట్ వన్ కి మించిపోయే రేంజ్ లో ఈ సినిమా ఉంటుంది అంటూ రిలీజ్ అయిన అప్డేట్స్ ఆధారంగా తెలుస్తుంది . ఈ సినిమా ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది . దీనికి సంబంధించి చిత్ర బృందం అధికారిక ప్రకటన కూడా చేసేసింది . ఆల్రెడీ పుష్ప2 గురించి ఒక గ్లింప్స్ కూడా రిలీజ్ అయ్యి వైరల్ అవుతుంది. అయితే రీసెంట్గా పుష్ప2 షూటింగ్ హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీ లో జరుగుతుంది.

ఇక్కడ నుంచి బన్నీ పిక్చర్ ఒక ఫోటో లీక్ అయి వైరల్ గా మారింది . అల్లు అర్జున్ బ్లూ చీర కట్టుకొని కుర్చీలో కూర్చొని ఉన్న ఒక ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది. తిరుపతి గంగమ్మ జాతర సన్నివేశాలతో పుష్ప2 సినిమాలో కొన్ని సీన్స్ ఉండబోతున్నాయట . ఆల్రెడీ ఆ జాతరకు సంబంధించిన సీన్స్ కంప్లీట్ అయిపోయాయి . అయితే ఇప్పుడు మరికొన్ని సీన్స్ ని యాడ్ చేయబోతున్నాడట సుకుమార్.

అల్లు అర్జున్ కు చీర కట్టి అచ్చం అమ్మవారి లాగానే రెడీ చేశారు . లీకైన ఫోటోలో బన్నీ లుక్స్ చూస్తుంటే కేక పెట్టిస్తున్నాయి . కచ్చితంగా సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది అని చెప్పడంలో సందేహం లేదు . క్రేజీ ఫోటోలు లీక్ కావడంతో బన్నీ ఫాన్స్ ఫుల్ ఎక్సైట్ అయిపోతున్నారు . సినిమా ఓ రేంజ్ లో ఉండబోతుంది అంటూ హంగామా చేస్తున్నారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news