త్రిబుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా దాటేసి పాన్ వరల్డ్ హీరోలు అయిపోయారు మన యంగ్‌టైగర్ ఎన్టీఆర్, మన మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్. త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత ఇప్పుడు ఈ ఇద్దరు హీరోల నుంచి వస్తోన్న క్రేజీ ప్రాజెక్టులు దేవర, గేమ్ ఛేంజర్. ఈ రెండు బిగ్ ప్రాజెక్టులే. దేవర సినిమాకు కొరటాల శివ దర్శకుడు. పాన్ ఇండియా రేంజ్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. జాన్వీకపూర్, సైఫ్ ఆలీఖాన్ లాంటి బాలీవుడ్ తారాగణం ఉంది. అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ డైరెక్టర్. ఆచార్య ప్లాప్ తర్వాత కొరటాల చాలా కసితో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
ఇటు త్రిబుల్ ఆర్ తర్వాత ఆచార్య చేసినా సోలోగా మాత్రం చరన్ గేమ్ ఛేంజర్ సినిమాతోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఒకప్పుడు సౌత్ ఇండియాను శాసించిన సీనియర్ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా ఈ సినిమా వస్తోంది. కియారా అద్వానీ హీరోయిన్. ఇది కూడా పాన్ ఇండియా రేంజ్లో భారీ అంచనాలతో వస్తోంది. ఇప్పుడు ఈ రెండు సినిమాల మధ్య అన్ని విషయాల్లోనూ కంపేరిజన్ వస్తోంది.
ఎవరిది పైచేయి అవుతుంది .. ఏ సినిమా బిజినెస్ టాప్‌లో ఉంటుందన్నది ఆసక్తికరం. ఓవర్సీస్ రైట్స్ విషయంలో గేమ్ ఛేంజర్ కంటే దేవర ముందుంది. దేవర ఓవర్సీస్ రైట్స్‌ను ఒక్క డీల్‌లో రు. 27 కోట్లకు అమ్మేలా ఒప్పందాలు జరిగినట్టు తెలుస్తోంది. ఇది ఎన్టీఆర్ – కొరటాల కాంబినేషన్ అయినా చాలా ఎక్కువ. అయితే సినిమా హిట్ అయితే ఈ రేంజ్ వసూళ్లు చాలా సులువు. హనుమాన్ సినిమాకే ఓవర్సీస్లో 5 మిలియన్ డాలర్లు దాటేసి ఇప్పుడు 6 మిలియన్ డాలర్లు వచ్చేలా ఉంది.
ఇక చరణ్ గేమ్ ఛేంజర్ ఓవర్సీస్ రైట్స్‌ను ముందుగానే దిల్ రాజు ఎప్పుడో ఓ సంస్థకు రు. 22 కోట్లకు అమ్మారట. సినిమా లేట్ అవుతుందని ఆ సంస్థ కంప్లైంట్ చేయడంతో వడ్డీలతో సహా వాళ్ల అమౌంట్ వెనక్కు ఇచ్చేసి ఇప్పుడు ఫ్రెష్‌గా రు. 25 కోట్ల రేంజ్ కోట్ చేస్తున్నట్టు భోగట్టా..! ఏదేమైనా ఓవర్సీస్ రైట్స్ విషయంలో చరణ్ సినిమా కంటే ఎన్టీఆర్ సినిమాది కాస్త పై చేయి ఉన్నట్టుగా కనిపిస్తోంది.