Moviesఇండస్ట్రీని షేక్ చేస్తున్న ప్రశాంత్ వర్మ భార్య బ్యాక్ గ్రౌండ్ ఏంటో...

ఇండస్ట్రీని షేక్ చేస్తున్న ప్రశాంత్ వర్మ భార్య బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా..? ఎవరి కూతురు అంటే..?

ప్రశాంత్ వర్మ .. ఇప్పుడు ఈ పేరు సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఎలా మారుమ్రోగిపోతుందో మనం చూస్తూనే ఉన్నాం. మరి ముఖ్యంగా గతంలో ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన సినిమాలు బాగా హిట్ అయినప్పటికీ ఆయనకు ఇప్పుడు ఉన్నంత ఫ్యాన్ ఫాలోయింగ్.. క్రేజ్ ..పబ్లిసిటీ రాలేదని చెప్పాలి . రీసెంట్గా ఆయన తెరకెక్కించిన హనుమాన్ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది .

ఎంతలా అంటే ఏకంగా 250 కోట్లు కలెక్ట్ చేసి సంచలన రికార్డును నెలకొల్పింది. ఈ క్రమంలోనే ప్రశాంత్ వర్మ పేరు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. చూడడానికి చాలా యంగ్ గా ఉండడం చాక్లెట్ బాయ్ లా ఉండడంతో అందరూ అమ్మాయిలు ఈ డైరెక్టర్ పై మనసు పారేసుకుంటున్నారు. తమ ఫేవరెట్ క్రష్ లిస్ట్ లోకి ప్రశాంత్ వర్మను యాడ్ చేసేసుకుంటున్నారు . అయితే అలాంటి వాళ్లకు ఇది గుండెలు బద్దలైపోయే న్యూస్ అనే చెప్పాలి .

మీరు అనుకున్నట్లు ప్రశాంత్ వర్మ బ్యాచిలర్ కాదు.. పెళ్లయిపోయింది ఆయన భార్య పేరు సుకన్య. చాలామందికి ప్రశాంత్ వర్మ పెళ్లి చేసుకున్నాడు అనే విషయం తెలియదు . ఆయన తన ఫ్యామిలీ లైఫ్ ను సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంచుతాడు . తన భార్య ఫోటోలు కూడా బయట ఎక్కడా కనిపించవు. రీసెంట్ గా హనుమాన్ సక్సెస్ సెలబ్రేషన్స్ లో భాగంగా ప్రశాంత్ వర్మ భార్య కూడా ఆ ఈవెంట్ కి హాజరైంది . ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ప్రశాంత్ వర్మ భార్య సుకన్య ఫొటోస్ ట్రెండ్ అవుతున్నాయి .

ఈవెంట్ లో ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ ..”తనకు సపోర్టుగా నిలిచినందుకు సినిమా కోసం ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్న .. తనతో టైం గడపలేకపోయినా.. తనని అర్థం చేసుకున్నందుకు తన భార్యకు థాంక్స్ చెప్పాడు ..తేజ సజ్జ కూడా ప్రశాంత్ వర్మ భార్య సుకన్య కు థాంక్స్ చెప్పాడు”. దీంతో ఆమె ఫొటోస్ వైరల్ అవుతున్నాయి . కాగా సుకన్య చాలా సింపుల్ గా కనిపిస్తుంది . అందరి హీరోల భార్యలు ఆడంబరంగా కనిపిస్తే సుకన్య మాత్రం సింపుల్ లుక్స్ లో ఆకట్టుకుంటుంది . అచ్చం ప్రశాంత్ వర్మ ఇష్టపడే విధానాన్ని ఫాలో అవుతుంది. వీళ్లది ప్రేమ వివాహం అంటూ తెలుస్తుంది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news