ఏదో అప్పట్లో శివ హిట్ ఇచ్చాడన్న నమ్మకంతో నాగార్జున రిస్క్ చేసి మరి ఆర్జివితో ఆఫీసర్ సినిమా చేశాడు. అసలేమాత్రం ఫాంలో లేని ఆర్జివి తన ఫోకస్ అంతా ట్విట్టర్ లో ఎవరిని ఎలా కెలుకుదామా అన్నట్టుగా కాలం వెళ్లదీస్తున్నాడు. ఇలాంటి టైంలో నాగ్, వర్మల సినిమా అంటే అందరికి షాక్ ఇచ్చింది.
ఏ నమ్మకంతో నాగార్జున ఈ సినిమా ఒప్పుకున్నాడో ఏమో కాని ఊపిరి తర్వాత కాస్త వెనుకపడి ఉన్న నాగార్జునని మరింత వెనక్కి లాగేసేలా చేశాడు వర్మ. సినిమా చెత్త అంటున్నా నాగార్జున వరకు సూపర్ అంటున్నారు. అందరు అనుకునేది ఒకటే ఎందుకు నాగ్ ఇంత పెద్ద రిస్క్ చేశాడు అని. ఒక్క సినిమా ఫ్లాప్ తోనే చాలా వెనక్కి వెళ్తున్న ఈ తరుణంలో ఆర్జివి సినిమాల ఫలితాలు తెలుస్తున్నా నాగార్జున ఆఫీసర్ చేయడం వెనుక లాజిక్ అర్ధం కావట్లేదు.
సినిమా పోతే హీరోది ఏముంది అంటారు. కాని హీరో దే ఉంటుంది. మళ్లీ హిట్ కొట్టేదాకా ఆ ఫ్లాప్ తాలూఖా నీలి నీడలు వెంటాడుతూనే ఉన్నాయి. నాగ్ యంగ్ అండ్ డైనమిక్ గా ఉన్నప్పుడు వరుస ప్రయోగాలు చేస్తే తుస్సుమన్నాయి. మళ్లీ నువ్వు వస్తావనితో హిట్ ట్రాక్ ఎక్కాడు. మరి చూస్తుంటే మళ్లీ నాగార్జున కెరియర్ సందిగ్ధంలో పడబోతుందని అందరు అనుకుంటున్నారు. అంతేకాదు తనయుల కెరియర్ మీద దృష్టి పెట్టి ఈమధ్య సినిమాల మీద ఫోకస్ కూడా తగ్గించినట్టున్నాడు. ఏది ఏమైనా మళ్లీ నాగ్ తిరిగి సక్సెస్ ట్రాక్ ఎక్కాలని ఆశిస్తున్నారు సిని ప్రియులు.