హీరో గోపీచంద్‌కు హిట్ వచ్చి ఎప్పుడో జమానా కాలం దాటేసింది. ఎప్పుడో మూడేళ్ల క్రితం ఓ యావరేజ్ సినిమా పడింది. దానికి ముందు.. ఆ తర్వాత అన్నీ ప్లాపులే ప్లాపులు. గోపీచంద్ మార్కెట్ పూర్తిగా పడిపోయింది. గతేడాది చేసిన రామబాణం ఎంత పెద్ద ప్లాపో చూశాం. ప్రస్తుతం చేతిలో ఉన్న సినిమా సరే.. ఆ తర్వాత ఎవరు సినిమా చేస్తారు ? అంటే మిలియన్ డాలర్ల ప్రశ్నే అన్న గుసగుసలు టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తున్నాయి.
గోపీచంద్‌తో సినిమా తీయాలనుకుంటున్నా కూడా నిర్మాతలు భయపడుతున్నారట. అసలే మార్కెట్ లేదు.. హీరోకే రు.10 కోట్లు రెమ్యునరేషన్ ఇవ్వాలట. ఈ విషయంలో అస్సలు రాజీపడడం లేదంటున్నారు. ఇక నాన్ థియేటర్ మార్కెట్ లేదు. ఇక థియేటర్ మార్కెట్ కూడా దిగజారిపోయింది. అసలు అడ్వాన్స్ లు లేకుండా కమీషన్ బేస్ మీద రిలీజ్ చేసి డబ్బులొస్తే.. ఇస్తాం లేకపోతే లేదన్నట్టుగా డిస్ట్రిబ్యూటర్ల వ్యవహారం ఉందట.
ఇక హీరోకే రు. 10 కోట్లు అంటే, ఇతర నటీనటులు, దర్శకుల రెమ్యునరేషన్ మరో రు. 10 కోట్లు.. ఇక సినిమా మేకింగ్‌కు మరో రు. 20 కోట్లు.. ఇది కూడా తక్కువలో తక్కువ అనుకోవాలి. అంటే రు. 40 కోట్లు లేనిదే గోపీచంద్ సినిమా పూర్తికాదు. ఇటు థియేటర్ మార్కెట్ లేదు.. నాన్ థియేటర్ మార్కెట్టు విషయంలోనూ ఎవ్వరూ ఆసక్తితో ఉండడం లేదు. అంటే గోపీచంద్ తో సినిమా అంటే నిర్మాతలు ఎంత లేదన్నా రు. 40 కోట్ల భారీ రిస్క్ చేయాలి.
ఇంత పెట్టుబడి పెట్టినా ఎంత వెనక్కు వస్తుందో తెలియదు. అదే గోపీచంద్ తన రెమ్యునరేషన్ రు. 5 కోట్లకు తగ్గించుకుని.. మేకింగ్ కాస్త కంట్రల్లో ఉంచుకుని.. సినిమాకు లాభాలు వచ్చాక అందులో వాటా తీసుకుంటే నిర్మాతలు సేఫ్‌జోన్‌లో ఉంటారు. గోపీచంద్‌తో సినిమాలు తీసేందుకు పలువురు నిర్మాతలు ముందుకు వస్తారు. లేకపోతే గోపీచంద్‌తో ఇకపై సినిమాలు తీసేందుకు పేరున్న నిర్మాతలు ఎవ్వరూ ముందుకు వచ్చే పరిస్థితి ఉండదన్న గుసగుసలు టాలీవుడ్‌లో వినిపిస్తున్నాయి.