నాగ్, వర్మ కాంబో అనగానే అందరికి శివ గుర్తుకొస్తుంది. వర్మ మొదటి సినిమానే అయినా బెంచ్ మార్క్ మూవీగా అది ఇద్దరికి సూపర్ క్రేజ్ తెచ్చిపెట్టింది. అయితే పాతికేళ్ల తర్వాత ఈ కాంబినేషన్ లో మూవీ అనగానే అంచనాలు ఏర్పడతాయి. ఆఫీసర్ గా నాగార్జున టీజర్, ట్రైలర్ సోసోగానే అనిపించాయి కాని సినిమా మాత్రం సూపర్ అనేస్తున్నారు పబ్లిక్.
మొదటి షో చూసిన ఆడియెన్స్ నాగార్జున నటనకు ఫిదా అవుతున్నారు. ముఖ్యంగా అక్కినేని ఫ్యాన్స్ కు ఈ సినిమా బాగా నచ్చింది. వర్మ అభిమానులు తమ దర్శకుడు మళ్లీ తిరిగి ఫాంలోకి వచ్చాడని చెబుతున్నారు. ఇక ఫ్లాపుల్లో ఉన్న వర్మ అడుగగానే సినిమా ఇచ్చిన నాగార్జునకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు ఆర్జివి.
సినిమా అంతా గ్రిప్పింగ్ గా తీశారని అంటున్నారు. మరి టాక్ ఈ రేంజ్ లో ఉంది అంటే వర్మ మళ్లీ ఫాంలోకి వచ్చేసినట్టే. దర్శక నిర్మాతగా వర్మ మనసు పెట్టి తీస్తే సినిమా ఎలా ఉంటుందో ఆఫీసర్ చూస్తే అర్ధమవుతుంది. వర్మ నుండి ఇలాంటి సినిమాలే రావాలని కోరుకుందాం.