సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో స్టార్ హీరోస్ ఫ్యాన్స్ ఎలా తమ హీరోలను సపోర్ట్ చేస్తూ వస్తున్నారో మనం చూస్తున్నాం. మరీ ముఖ్యంగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమా విషయంలో ఫాన్స్ ఎక్కువగా కాన్సెంట్రేషన్ చేస్తున్నారు. రామ్ చరణ్ ఎన్టీఆర్ ల మధ్య వ్యత్యాసం చూపుతున్నారు. ఈ సినిమాలో ఇద్దరిదీ సమానమైన పాత్రలు అయినప్పటికీ ఎవరు గొప్ప..? ఎవరి పాత్ర ఎక్కువ..?
ఎవరిది తక్కువ..? అని నెట్టింట చర్చించుకుంటున్నారు. రీసెంట్గా రామ్ చరణ్ హీరో అని తారక్ ది సపోర్టింగ్ పాత్ర అని చరణ్ అభిమానులు మరోసారి సోషల్ మీడియాలో సరికొత్త చర్చలు లేవదీశారు . ఇలాంటి క్రమంలోనే రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తారక్ పై పాజిటివ్ కామెంట్స్ చేశారు. మీడియా వారు ఆర్ఆర్ఆర్ ప్రస్తావని తీసుకోరాగా.. రాజమౌళి మాట్లాడుతూ..” ఒకవేళ ఈ సినిమాలో కొమురం భీముడు సాంగ్తోనే మూవీ ఎండ్ అయిపోతే అప్పుడు రాంచరణ్ ది సైడ్ రోల్ అయిపోయి ఉండేది అని జక్కన్న చెప్పుకు వచ్చారు “.
ఈమాటతో తారక్ ఫాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు . అయితే రాజమౌళి కావాలనే చరణ్ ని తక్కువ చేసి మాట్లాడారు అని ఫాన్స్ ట్రోల్ చేస్తున్నారు . నిజానికి రాజమౌళి – తారక్ – చరణ్ ఇద్దరిని తక్కువ చేయలేదు ..ఆయన రాసుకున్న కథ ప్రకారమే ముందుకెళ్లారు . ఈ విషయం ఫాన్స్ ఆలోచించి ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేస్తే అందరికీ మంచిది అంటున్నారు సామాన్య జనాలు..!!