దివంగత అతిలోక అందాల సుందరి శ్రీదేవికి తెలుగునాట ఎంత క్రేజ్ ఉందో తెలిసిందే. శ్రీదేవి కుమార్తె జాన్వీకపూర్‌ను తెలుగు తెరకు పరిచయం చేయాలని గత ఐదారు సంవత్సరాలుగా ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. అవేవి సక్సెస్ కాలేదు. ఎట్టకేలకు కొరటాల శివ – ఎన్టీఆర్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న దేవర సినిమాతో జాన్వీని తొలిసారిగా తెలుగులో.. ఇంకా చెప్పాలంటే సౌత్‌లో హీరోయిన్గా ఫస్ట్ టైం ఎంట్రీ ఇస్తోంది.
ఎన్టీఆర్ కు జోడీగా జాన్వీకపూర్ నటిస్తుందనగానే ఈ జోడీపై అంచనాలు మామూలుగా లేవు. వెండితెరపై వీరిద్దరి కెమీస్ట్రీని ఎంజాయ్ చేసేందుకు తెలుగు జనాలు రెడీగా ఉన్నారు. ఒకప్పుడు ఎన్టీఆర్ తాత సీనియర్ ఎన్టీఆర్, జాన్వీ తల్లి శ్రీదేవి కలిసి ఎన్నో సినిమాల్లో లీడ్ పెయిర్‌గా నటించి సూపర్ డూపర్ హిట్లు కొట్టారు. ఒకప్పుడు వీరిద్దరి కాంబినేషన్లో సినిమా అంటే ఆంధ్రా జనాలు ఉర్రూతలూగిపోయేవారు.
ఇప్పుడు మరోసారి ఎన్టీఆర్ మనవడు, శ్రీదేవి కూతురు అంటే ప్రేక్షకులు చాలానే ఊహించుకుంటున్నారు. కానీ దేవర టీం / డైరెక్టర్ కొరటాల జాన్వీని మోసం చేస్తున్నారా ? అన్న సందేహాలు మొదలయ్యాయి. దేవరలో జాన్వీ పాత్రకు అంత ప్రాధాన్యత లేదట. ముందు రాసుకున్న స్క్రిఫ్ట్ ప్రకారం జాన్వీ పాత్రే సినిమాను మలుపు తిప్పుతుంది. అయితే కొరటాల దేవరను రెండు పార్టులుగా తెరకెక్కిస్తున్నట్టు ప్రకటన చేశారు.
దీంతో తొలిపార్ట్‌లో జాన్వీ నుంచి చాలా తక్కువ డేట్లు తీసుకుని కొన్ని సీన్లతో పాటు నాలుగు పాటలు షూట్ చేసినట్టు తెలుస్తోంది. దేవర కథ సముద్రం నేపథ్యంలో జరుగుతుందన్న విషయం తెలిసిందే. జాన్వీ పాత్ర ఓ మత్సకార కుటుంబానికి చెందిన యువతిగా ఉండబోతోందట. వచ్చే ఏప్రిల్ 5న దేవర 1 రిలీజ్ కానుంది.