మహేష్ బాబు.. రీసెంట్ గానే గుంటూరు కారం అనే సినిమాలో నటించి సగం హిట్ సగం ప్లాప్ టాప్ అందుకని కలెక్షన్స్ పరంగా మాత్రం కుమ్మి పడేశారు. రీసెంట్గా మహేష్ బాబు జర్మనీకి వెళ్ళిన విషయం తెలిసిందే . జర్మని అంటే ఏదో వెకేషన్ కో.. ఫామిలీ ట్రిప్పో అనుకున్నారు . కానీ ఆయన సోలో ట్రిప్ వెళ్ళిన తర్వాత ఇది రాజమౌళి సినిమా కోసం వెళ్లిన ట్రిప్ అంటూ అందరూ ఫిక్స్ అయ్యారు .
త్వరలోనే ఈ సినిమాపై అఫీషియల్ ప్రకటన ఉంది అంటూ అభిమానులు సంబరపడిపోయారు . సీన్ కట్ చేస్తే జర్మనీ ని వెళ్ళింది మహేష్ బాబు రాజమౌళి సినిమా కోసం కాదు అంటూ తేల్చేసాడు మహేష్ బాబు . తాజాగా చేసిన పోస్ట్ అభిమానుల గుండెలు బద్ధలు అయిపోయేలా చేసింది . మహేష్ బాబు ఒక డాక్టర్ని కలుసుకోవడం కోసం జర్మనీ వెళ్లారట . ఇదే విషయాన్ని ఆయనే ఓపెన్ గా చెప్పుకొచ్చాడు .
గతంలో ఏప్రిల్ లో అంతకుముందు జూన్లో కూడా మహేష్ బాబు ఆ డాక్టర్ ని కలుసుకున్నట్లు ఫోటోలు ఆధారంగా తెలుస్తుంది. ఇంతకీ మహేష్ బాబు కలిసిన ఆ డాక్టర్ ఎవరు? ఆయన దగ్గర ఏం ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు ..? అనేక ప్రశ్నలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.చూద్దాం దీని పై మహేశ్ భార్య నమ్రత ఏదైన క్లూ ఇస్తుందేమో..??