గ్లోబల్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్‌గా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తోన్న భారీ పాన్ ఇండియా సినిమా దేవర. రెండు భాగాలుగా తెరకెక్కుతోన్న దేవర ఫస్ట్ పార్ట్ ఈ యేడాది ఏప్రిల్ 5న పాన్ ఇండియా రేంజ్‌లో థియేటర్లలోకి రానుంది. కొరటాల శివవ – ఎన్టీఆర్ కాంబోలో గతంలో వచ్చిన జనతా గ్యారేజ్ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. దీంతో ఇప్పుడు సహజంగానే పాన్ ఇండియా రేంజ్‌లో వస్తోన్న దేవరపై అంచనాలు లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి.
ఇక ఈ సినిమా ఏరియాల వారీ థియేట్రికల్ రైట్స్ సొంతం చేసుకునేందుకు టాలీవుడ్ టాప్ నిర్మాతలు సైతం పోటీలు పడుతున్నారు. ఇక ఈ సినిమా ఓటీటీ రైట్స్ ఫిగర్స్ చూసి టోటల్ టాలీవుడ్ షేక్ అవుతోంది. దేవర ఓటీటీ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. మేకర్స్ కూడా దీనిపై అధికారికంగానే ఎనౌన్స్ చేశారు. ఈ సినిమా ఓటీటీ రైట్స్ సొంతం చేసుకునేందుకు నెట్‌ఫ్లిక్స్ ఏకంగా రు. 155 కోట్లు ఇచ్చినట్టు తెలుస్తోంది.
ఇది చాలా బిగ్ డీల్‌గా చెప్పాలి. అసలే త్రిబుల్ ఆర్‌తో ఎన్టీఆర్ డబుల్ హ్యాట్రిక్ హిట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. త్రిబుల్ ఆర్‌తో ఏకంగా గ్లోబల్ స్టార్ అయిపోయాడు. ఈ సినిమా తర్వాత పాన్ ఇండియా రేంజ్‌లో వస్తోన్న సినిమా కావడంతో సహజంగానే దేవరపై ఇండియా వైజ్‌గా అంచనాలు ఉన్నాయి. ఆచార్య తర్వాత కొరటాల శివ కసితో కూర్చొని రెండేళ్లు టైం తీసుకుని దేవర తీస్తున్నాడు.
కేవలం ఓటీటీ రైట్సే రు. 155 కోట్లు పలకడం అంటే మామూలు సెన్షేషన్ కాదు. ఏదమైనా దేవర తర్వాత ఎన్టీఆర్‌కు తిరుగులేని పాన్ ఇండియా ఇమేజ్ వచ్చేయనుంది. యువసుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.