నేచురల్ స్టార్ నాని సినిమాలు పరిశీలిస్తే గత కొంతకాలంగా వైవిధ్యమైన కథలతో సినిమాలు చేస్తున్నాడు. నాని సినిమాలకు ప్రత్యేకంగా అభిమానులతో పాటు మహిళా అభిమానులు కూడా ఉన్నారు. అయితే నాని సినిమాలు సూపర్ హిట్ అయినా అనుకున్న రేంజ్‌లో వసూళ్లు రావడం లేదు. దసరా సినిమాకు రు. 100 కోట్లు అన్నారు. కానీ నిర్మాత హ్యాపీ అయ్యే లాభాలు రాలేదు. నాని సినిమాలకు గత పదేళ్ల క్రితం ఏ స్థాయిలో వసూళ్లు వచ్చాయో ఓ 10 % అటూ ఇటూగా ఇప్పుడూ అవే వసూళ్లు వస్తున్నాయి.
పదేళ్ల క్రితం నాని సినిమాలకు ఎంత థియేట్రికల్ బిజినెస్ జరిగిందో… ఇప్పుడు కాస్త అటూ ఇటూగా అదే నడుస్తోంది. కానీ నాని రెమ్యునరేషన్ పదేళ్ల క్రితం రు. 6-8 కోట్లలో ఉంటే ఇప్పుడు ఏకంగా రు. 25 కోట్ల రేంజ్‌లో ఉంది. సినిమా హిట్ అయినా.. ప్లాప్ అయినా నాని రెమ్యునరేషన్ మాత్రం పెరుగుతూ వస్తోంది. ఆ స్థాయిలో నాని సినిమాలకు థియేట్రికల్ వసూళ్లు రావడం లేదన్నది ట్రేడ్ వర్గాలు చెప్పే నగ్న సత్యం. దీనిని ఎవరు అంగీకరించినా.. అంగీకరించకపోయినా నిజం. ఇది ఒప్పుకుని తీరాల్సిందే.
ఇక నాని తాజా సినిమా హాయ్ నాన్నకు కూడా ముందు స్లోగా మొదలైనా తర్వాత ఫికప్ అయ్యింది. అనుకున్న లాభాలు లేవు. నాని కొత్త సినిమాకు దానయ్య నిర్మాత. సరిపోదా శనివారం అంటూ వస్తోన్న ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ దిల్ రాజుకు రు. 25 కోట్లకు అమ్మేసినట్టు తెలుస్తోంది. ఇది యాక్షన్ సినిమా. నాని – వివేక్ ఆత్రేయ కాంబోలో వస్తోన్న రెండో సినిమా ఇది.
ఇటీవల కాలంలో నాని మార్కెట్ ఏమంత బాగోలేదు. దానయ్య కూడా రిలీజ్‌కు ముందు వరకు రైట్స్ ఉంచుకుని ఆ టైంలో అమ్మినా ఎవరు కొంటారో.. అనుకున్న మొత్తాలు వెనక్కు వస్తాయో రావో అన్న సందేహంతో దిల్ రాజుకు హోల్‌సేల్‌గా ఏపీ, తెలంగాణ రైట్స్ రు. 25 కోట్లకు అమ్మి వదిలించేసుకున్నారని ఇండస్ట్రీ టాక్ ?
నాని ఎంచుకునే కథల రేంజ్ కొంత వరకే ఉంటుందని.. అవి కొన్ని వర్గాల వారికి మాత్రమే రీచ్ అవుతున్నాయని.. అందుకే నాని రెమ్యునరేషన్ సినిమా.. సినిమాకు పెరుగుతున్నా… బిజినెస్ పెరగడం లేదు.. వసూళ్లు పెరగడం లేదంటున్నారు. నాని ఇలాంటి మూసకథలతోనే సినిమాలు చేస్తే మనోడి కెరీర్ ఎదుగు బొదుగు ఉండదని కూడా అంటున్నారు. మరి ఇకనైనా నాని కథలు ఎంచుకునే విషయంలో మారతాడేమో ? చూడాలి.