Moviesవిశాల్ అభిమన్యుడు ట్రైలర్.. మ్యాటర్ మాములుగా లేదు..!

విశాల్ అభిమన్యుడు ట్రైలర్.. మ్యాటర్ మాములుగా లేదు..!

విశాల్ హీరోగా పి.ఎస్.మిత్రన్ డైరక్షన్ లో వస్తున్న సినిమా అభిమన్యుడు. ఆల్రెడీ తమిళంలో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయిన ఈ సినిమా ఇప్పుడు జూన్ 1న తెలుగు వర్షం రిలీజ్ చేస్తున్నారు. సమంత ఫీమేల్ లీడ్ గా నటించిన ఈ సినిమా ట్రైలర్ కొద్దినిమిషాల క్రితం రిలీజ్ అయ్యింది. ఇక ఈ సినిమాలో విశాల్ యాంగ్రీ ఆర్మీ ఆఫీసర్ గా నటిస్తున్నాడు.

ప్రస్తుతం సైబర్ నేరాలు ఎక్కువవుతున్న ప్రస్తుతం తరుణంలో అదే నేపథ్యంలో సినిమా కథ రాసుకున్నాడు దర్శకుడు. సినిమాలో విలన్ గా యాక్షన్ కింగ్ అర్జున్ నటించడం జరిగింది. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందించిన ఈ సినిమా ట్రైలర్ లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదిరిపోయింది. ప్రస్తుతం తెలుగులో మళ్లీ సూపర్ ఫాం అందుకున్న సమంత ఈ అభిమన్యుడుతో కూడా హిట్ కొట్టేస్తుందని ట్రైలర్ చూస్తే చెప్పొచ్చు.

కంటెంట్ ఉంటే అది ఎలాంటి సినిమా అయినా ఆదరిస్తారు తెలుగు ప్రేక్షకులు. మరి విశాల్ అభిమన్యుడు ట్రైలర్ చూస్తే మంచి మ్యాటర్ ఉన్నట్టే అనిపిస్తుంది.ఫస్ట్ డే ఫస్ట్ షో చూసెయ్యాలి అన్నట్లుగా ఉందంటే నమ్మండి. సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి. జూన్ 1న నాగార్జున ఆఫీసర్ తో పాటుగా ఈ సినిమా వస్తుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news